Begin typing your search above and press return to search.
ట్రంప్ కిమ్ భేటీతో లాభపడేది మొదట వీరే
By: Tupaki Desk | 9 Jun 2018 4:44 AM GMTకొద్దికాలం కిందటి వరకు కత్తులు నూరి...కయ్యానికి కాలు దువ్విన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విబేధాలను పక్కనపెట్టి సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈనెల12న సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో రెండు దేశాల ప్రజలు తమకు సంతోషపడుతున్నప్పటికీ..వాళ్ల కంటే ఎక్కువగా ఖుష్ అవుతోంది సింగపూర్ వాసులని అంటున్నారు. ఎందుకంటే...ట్రంప్-కిమ్ భేటీని ఈ రెండు దేశాల రెస్టారెంట్ల ఓనర్లు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.
ఈ ఇద్దరు ప్రముఖుల సమావేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బార్లు - రెస్టారెంట్ల ఓనర్లు కాక్ టెయిల్ కు ట్రంప్ కాక్ టైల్ అని - టాకోస్ కు కిమ్ టాకోస్ అని పేర్లు పెట్టేసి ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. కేవలం పేర్లు మార్పిడే కాకుండా అమెరికా వంటకాలను - కొరియా వంటకాలను కలిపి ‘ట్రింప్-కిమ్ చీ నాసి లెమ్ క’ పేరుతో ఒక కొత్త రకం వంటకాన్ని తయారుచేశారు. పైగా వాటిని కేవలం నీలం - ఎరుపు రంగులలోనే తయారు చేస్తున్నారు. అవి ఆ రెండు దేశాల జెండా రంగులను సూచిస్తాయి.సాధారణంగా కొరియన్లు మందు ప్రియులు కాబట్టి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ కిమ్ వోడ్కా పేరుతో మందు ప్రియులకు అందిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల సమావేశం తమకు కాసులు కురిపిస్తోందని - డిమాండ్ బాగుందని రెస్టారెంట్ల యజమానులు ఖుష్ అవుతుండటం గమనార్హం.
ఇదిలాఉండగా...ఈ సమావేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య సమావేశం సజావుగా సాగితే కిమ్ ను అమెరికాకు ఆహ్వానిస్తామని ట్రంప్ వెల్లడించారు. కిమ్ ను వైట్ హౌస్ కు లేదా మార్-ఎ-లోగా రిసార్టుకు ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రతినిధులు ట్రంప్ ను ప్రశ్నించగా.. సింగపూర్ భేటీ సఫలమైతే కిమ్ ను వైట్ హౌస్ కే ఆహ్వానిస్తానని తెలిపారు. సింగపూర్ సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. ఈ సమావేశంతో అద్భుతాలు జరుగు తాయని ఆశిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ కిమ్‌తో సమావేశంలో ఏదైనా సమస్య వస్తే, తన అంచనాలు చేరుకోక పోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతానని ట్రంప్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, అంత అవసరం తనకు రాదని ఆశిస్తున్నానని అన్నారు. కిమ్ తన దేశ ప్రజల కోసం ఏదైనా గొప్పగా చేయాలని అనుకుంటున్నారని తాను నమ్ముతున్నానని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు.