Begin typing your search above and press return to search.
సింగపూర్లో మోడీ మేనియా
By: Tupaki Desk | 14 Nov 2016 6:30 AM GMTప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఇండియాలో ఇమీడియట్ గా పాజిటివ్ రెస్పాన్సు వచ్చినా క్రమంగా ప్రజలు ఒక్కో ఇబ్బంది ఎదురవుతున్న కొద్దీ మోడీని తిట్టనారంభిస్తున్నారు. ఆర్థిక రంగ నిపుణులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది అద్భుత నిర్ణయం అనేవారూ.. అదేసమయంలో అనాలోచిత నిర్ణయమంటూ విమర్శిస్తున్నవారూ ఉన్నారు. తాజాగా విదేవాల్లో మాత్రం మోడీని పొగుడుతూ కథనాలు వస్తుండడంతో నిన్న కొంత డీలా పడిన మోడీ ఈవేళ కొత్త ఉత్సాహం నింపుకొన్నారని చెబుతున్నారు.
మోడీ ఈ నెల 8న ఈ నిర్ణయం ప్రకటించిన తరువాత వెనువెంటనే విదేశీ మీడియా స్పందించింది. అయితే... దీనివల్ల మంచి చెడుల గురించి మాట్లాడకుండా మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారంటూ ఆ విషయం మాత్రమే రాశారు. ఆ తరువాత ఏటీఎంలు - బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్న వైనాన్ని వర్ణించారు. కానీ... తాజాగా సింగపూర్ మీడియా మాత్రం మోడీని ఆకాశానికెత్తేసింది.
సింగపూర్ మీడియా మన మోడీని ఆ దేశ తొలి ప్రధాని లీక్వాన్ యూతో పోల్చింది. సింగపూర్ అభివృద్ధిలో లీక్వాన్ దార్శనికత, నిర్ణయాలే మెట్లని మారుతున్నాయని రాశాయి. అవినీతి - నల్లధనాన్ని ఏరి పారేసేందుకు రూ. వెయ్యి - రూ.500 నోట్లను రద్దు చేశారని ప్రశంసించాయి. కాగా సింగపూర్ తొలి ప్రధాని లీక్వాన్ ఆర్థిక విధానాలు... సాహసోపేతమైన నిర్ణయాల కారణంగానే సింగపూర్ ఇప్పుడు ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచింది.
లీక్వాన్ గత ఏడాది మార్చిలో కన్నుమూశారు. సింగపూర్ మీడియా మోడీలో లీక్వాన్ ను చూసింది. 'ఇండియాలో లీక్వాన్ మళ్లీ పుట్టాడు" అంటూ హెడ్డింగులు పెట్టి మరీ రాయడంతో బీజేపీలో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/