Begin typing your search above and press return to search.

సీడ్ క్యాపిటల్ కూల్.. కూల్ గా చేస్తారట

By:  Tupaki Desk   |   13 Aug 2015 6:01 AM GMT
సీడ్ క్యాపిటల్ కూల్.. కూల్ గా చేస్తారట
X
ఏపీ రాజధాని విజయవాడ.. గుంటూరు మధ్యన అని చెప్పిన వెంటనే ఉలిక్కి పడిన వారెందరో. మామూలుగా వేడి మంటతో పాటు.. చమటతో ఉక్కిరిబిక్కిరి కావటం ఆ ప్రాంతంలో మామూలే. నిజానికి ఈ వాతావరణ పరిస్థితి ఏపీ రాజధానికి శాపమని వ్యాఖ్యానించే వారెందరో. గడిచిన పదేళ్లలో పచ్చదనం మరింత తగ్గిపోవటంతో విజయవాడ.. గుంటూరు ప్రాంతాల్లో ఏడాది పొడుగునా ఎండలు మండుతున్న పరిస్థితి.

ఈ విషయాన్ని గుర్తించిన సింగపూర్ దేశీయులు.. ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తలు సూచించారట. అంతేకాదు.. దీనికి తగ్గట్లు ఒక ప్రణాళిను రూపొందించారట. ఏపీ సీడ్ క్యాపిటల్ లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా.. చల్లదనంతో కూల్ కూల్ గా ఉండేలా ఒక ప్లాన్ ను సిద్ధం చేశారట.

దీని ప్రకారం.. కృష్ణా నదికి సహజసిద్ధంగా ఈశాన్య గాలులు వీచే దానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవటంతో పాటు.. భారీ నిర్మాణాలు ఆ దిశగా ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు. ఈశాన్య గాలుల్ని అడ్డుకునేలా నిర్మాణాలు ఎంతమాత్రం ఉండకూడదని.. దీనికి తోడు.. సీడ్ రాజధానిలో కట్టే ప్రతి భవనం గ్రీన్ హౌస్ లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. భారీ ఎత్తున మొక్కలు పెంచాలని భావిస్తున్నారు.

ఈ విధానాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తే.. అమరావతి ప్రాంతం కూల్ గా ఉండటం ఖాయమని చెబుతున్నారు. రాజధాని సీడ్ క్యాపిటల్ లో ప్రభుత్వ.. ప్రైవేటు భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయించారు. సింగపూర్ ప్రతినిధులు రూపొందించిన ప్లాన్ ను యథాతథంగా అమలు చేస్తే.. వేసవిలోనూ సీడ్ క్యాపిటల్ ప్రాంతం కూల్ గా ఉండటం ఖాయమంటున్నారు.