Begin typing your search above and press return to search.

ఈ హడావుడంతా ఉపఎన్నిక కోసమేనా ?

By:  Tupaki Desk   |   16 Sep 2021 4:48 AM GMT
ఈ హడావుడంతా  ఉపఎన్నిక కోసమేనా ?
X
సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రాంతంలోని చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటనపై మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక్కసారిగా హడావుడి పెంచేశారు. వీళ్ళలాగే ప్రతిపక్షాల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఒక్కసారిగా చిన్నారి ఇంటికి క్యూ కట్టారు. అత్యాచారం జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇంత హడావుడి ఎందుకు జరుగుతోంది ? అంటే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే అనే సమాధానం వస్తోంది.

ఘటన జరిగిన ప్రాంతం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందట. నవంబర్లో ఉపఎన్నిక జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ కారణంగానే వచ్చే ఉపఎన్నికలో లబ్దిపొందటమే టార్గెట్ గా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఘటన జరిగిన మొదటి రెండు రోజులు ఏ పార్టీ కూడా ఈ కుటుంబంపై పెద్దగా దృష్టిపెట్టలేదు.

ఘటన జరిగిన సమయంలోనే సినీనటుడు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోటారు బైక్ ప్రమాదం జరిగింది. దాంతో మొత్తం మీడియా ఫోకసంతా బైక్ యాక్సింట్ మీదే ఉండిపోయింది. నాలుగురోజుల పాటు యాక్సిడెంటపై వార్తలు ప్రత్యేక కథనాలతో జనాలను విసిగించేసింది మీడియా. మీడియా ధోరణిపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆరోపణలు పెరిగినాయి.

చిన్నారిపై అత్యాచార ఘటనకన్నా మీడియాకు సినీనటుడి యాక్సిడెంట్ వార్తే ప్రధానమైపోయిందా అంటు సోషల్ మీడియాలో అమ్మనాబూతులు మొదలయ్యాయి. అప్పటికే యాక్సిడెంట్ ఘటన పాతబడిపోవటం, చిన్నారి హత్యాచార ఘటనపై మీడియా ధోరణిపై జనాల్లో ఆగ్రహం మొదలవ్వటంతో ఒక్కసారిగా చిన్నారి హత్యాచార ఘటనపై మీడియా ఫోకస్ పెంచేసింది. దాంతో రాజకీయపార్టీలు కూడా హడావుడి మొదలుపెట్టేశాయి.

ఈ మొత్తానికి కారణం ఏమిటంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్దిపొండటమే అసలు కారణంగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అందుకనే కాంగ్రెస్ నేత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే నిందితుడు రాజును టీఆర్ఎస్ ఎన్ కౌంటర్ చేస్తుందని చేసిన వ్యాఖ్యలను గమనించాల్సిందే. కేవలం ఉపఎన్నికలో లబ్దిపొందటానికే టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ మొదలైంది. లేకపోతే ఒక్కసారిగా మంత్రులు, సెలబ్రిటీలు, ప్రతిపక్షపార్టీల నేతల హడావుడంతా దేనికోసం ?