Begin typing your search above and press return to search.
గాలి చొరబడని చోటుకి కరోనా..తెలంగాణలో ఘోరం జరిగిందా?
By: Tupaki Desk | 31 March 2020 4:30 PM GMTనల్ల బంగారం...తెలంగాణలోని సింగరేణి గనుల్లో వెలికితీసే `బొగ్గు`కు మరోపేరు. అక్షరం ముక్క చదువు రాని వారి నుంచి మొదలుకొని అత్యున్నత చదువులు చదివిన వారి వరకు ఉపరితలం నుంచి కొన్ని వేల అడుగులు లోపల.. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు - ఉద్యోగులు ఈ సింగరేణి సొంతం. గనుల్లో పనిచేసే వారికి నిరంతరం బయటి నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తుంటారు. ఇప్పుడు అలా గనుల్లో పనిచేసే వారిలో కొత్త భయం మొదలైంది. అదే కరోనా వ్యాప్తి. గాలి చొరబడని చోటికి వైరస్ ఎలా వెళ్లిందంటారా? ఢిల్లీలో జరిగిన ‘మర్కజ్' మత సమావేశానికి వెళ్లిన వారిలో... ఓ ఇద్దరు సింగరేణి ఉద్యోగులు ఉన్నారట. ఆ సింగరేణి కార్మికులు ఇద్దరు వైరస్ బారిన పడ్డారట. దీంతో ఇప్పుడు కార్మికుల్లో కలవరం మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఎన్నడూ లేనిది తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస విలేకరుల సమావేశాలే దీనికి నిదర్శనం. తెలంగాణలో కేసుల సంఖ్య ప్రస్తుతం 78కి పెరిగింది. ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ ఇలా ఉంటే అసలు టెన్షన్...ఢిల్లీలో జరిగిన ఈ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వాళ్లలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించడం. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆ ఇద్దరినీ వెంటనే బెల్లంపల్లిలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. ఇప్పుడు వాళ్ల ద్వారా ఎందరికి వైరస్ సోకింది అనేది అసలు డౌట్. టెన్షన్ కు కారణం.
బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు కాకుండా సింగరేణికి సంబంధించిన ఇంకెవరైనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారా? అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా - ఆ ఇద్దరూ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత డ్యూటీలకు హాజరయ్యారా? ఎంతమందితో ఎక్కడెక్కడ కలిసి మాట్లాడారు? భూగర్భంలో పనిచేసేవారా? ఉపరితలంపై పనిచేసే ఉద్యోగులా? అనే విషయాలను పోలీసులు - అధికారులు ఆరాతీస్తున్నారు. కాగా, వారు ఒకవేళ గనుల్లో పనిచేసే వారైతే... భూగర్భంలోనూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో షిఫ్టులో ఒకేసారి వందల మంది కార్మికులు పని ప్రదేశంలో ఉంటారని - వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి బయట అందరూ పాటించే ‘సోషల్ డిస్టెన్స్' పద్ధతి గనిలో వీలుండదని ఇలాంటి సమయంలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని టెన్షన్ అవుతున్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగానైనా బొగ్గు బావుల్ని మూసేయడం మంచిదని దాదాపు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా....ఉత్పత్తి మాత్రం నిలిపే అవకాశం లేదని యాజమాన్యం వైఖరిగా ఉన్నట్లు తెలుస్తోంది.