Begin typing your search above and press return to search.

జాస‌న్ అల్డీన్ అంటే అమెరిక‌న్ల‌కు ఎంత క్రేజ్‌?

By:  Tupaki Desk   |   3 Oct 2017 5:27 AM GMT
జాస‌న్ అల్డీన్ అంటే అమెరిక‌న్ల‌కు ఎంత క్రేజ్‌?
X
భూత‌ల స్వ‌ర్గంగా కీర్తించే లాస్ వేగ‌స్‌ లో చోటు చేసుకున్న మార‌ణ‌హోమం ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. అమెరికా దేశ చ‌రిత్ర‌లో అతి పెద్ద‌దైన కాల్పుల ఘ‌ట‌న‌లో 58 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌న‌లో 515 మంది తీవ్ర గాయాల‌కు గుర‌య్యారంటే అక్క‌డి ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉంద‌న్న విష‌యం అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌కీ.. ఇంత మార‌ణ‌హోమానికి కార‌ణం ఏమిట‌న్నది చూస్తే.. అల్డీన్ మ్యూజిక్ షోగా చెప్పొచ్చు.

అమెరికాలో ఫేమ‌స్ అయిన మ్యూజిషియ‌న్ల‌లో అల్డీన్ ఒక‌రు. ఆయ‌న షో అంటే చాలు వేలాదిగా హాజ‌ర‌వుతుంటారు. 40 ఏళ్ల అల్డీన్ మ్యూజిక్ షో తాజాగా లాస్ వెగాస్ లోని రూట్ 91 హార్వెస్ట్ లో మ్యూజిక్ క‌న్స‌ర్ట్ జ‌రుగుతున్న వేళ 64 ఏళ్ల వృద్ధుడు హోట‌ల్ గ‌దిలో నుంచి తుపాకీతో సృష్టించిన మార‌ణ హోమంతో అగ్ర‌రాజ్యం షాక్ తింది.

స్టీఫెన్ పాడ్డాక్ అనే ముస‌లాయ‌న క‌న్స‌ర్ట్‌ కు కాస్త దూరంలో ఉన్న పెద్ద హోట‌ల్లో 32వ అంత‌స్తులోని త‌న గ‌దిలో నుంచి వ‌రుస పెట్టి జ‌రిపిన కాల్పుల‌తో భారీ ప్రాణ న‌ష్టం వాటిల్లింది. విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పులకు పాల్ప‌డిన ఆ ఉన్మాది హోట‌ల్ రూంలో 19 తుపాకీల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక‌.. అల్డీన్ విష‌యానికి వ‌స్తే 2016.. 2017 సంవ‌త్స‌రాల్లో ఆయ‌న సంగీతానికి అకాడ‌మీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును గెలుచుకున్నారు. అల్డీన్ రూపొందించిన ఏడు మ్యూజిక్ ఆల్బ‌మ్ లు ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 1.5 కోట్ల కాపీలు అమ్ముడ‌య్యాయి. అందులో మై కైండా పార్టీ.. నైట్ ట్రెయిన్ ముఖ్య‌మైన‌విగా చెబుతుంటారు. తాజాగా లాస్ వేగాస్ లో నిర్వ‌హించిన సంగీత విభావ‌రిలో వేలాదిగా ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు. కాసేప‌ట్లో కాన్స‌ర్ట్ ముగుస్తున్న వేళ‌.. చోటు మార‌ణ‌హోమంతో అల్డీన్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.

విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రుగుతున్న విష‌యాన్ని గుర్తించ‌కున్నా.. ఏదో తేడా జ‌రుగుతోంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించి త‌న షోను కొన్ని క్ష‌ణాలు ఆపేసి.. మ‌ళ్లీ య‌థావిధిగా షో నిర్వ‌హించారు. అనంత‌రం కాల్పులు జ‌రుగుతున్న విష‌యాన్ని గుర్తించి వెంట‌నే షో నిలిపేశారు. ఊహ‌కు సైతం అంద‌ని భ‌యోత్పాతంగా అల్డీన్ వ్యాఖ్యానించారు. తాను.. త‌న బృందం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డామ‌న్నారు. అయితే.. సంతోషంగా గ‌డ‌ప‌టానికి వ‌చ్చిన వారు ఇలా చ‌నిపోవ‌టం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంద‌న్నారు.