Begin typing your search above and press return to search.
సెక్యురిటీ తీసేసిన పక్కరోజునే ఆ సింగర్ ను చంపేశారు
By: Tupaki Desk | 30 May 2022 4:31 AM GMTఆదర్శాలు చెప్పటం వేరు.. వాటిని అమలు చేయటం వేరు. మంచి ఉద్దేశంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. ప్రభుత్వాలు ఊహించని రీతిలో షాకులు ఇస్తుంటాయి. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ప్రభుత్వానికి అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖులకు.. వీఐపీలకు భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ఏకకాలంలో దాదాపు 424 మంది వీఐపీలకు భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళలో.. తమది ప్రజా ప్రభుత్వమని.. వీఐపీ కల్చర్ కు చెక్ పెట్టటం తమ సర్కారు లక్ష్యంగా ఆయన చెప్పారు. సాధారణంగా వీఐపీలకు భద్రతను తొలగిస్తే వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
అందుకు భిన్నంగా పంజాబ్ లో మాత్రం భగవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిశాయి. ఈ ఆనంద సమయంలో అనూహ్య విషాదం చోటు చేసుకోవటమే కాదు.. ఆదర్శాలు వల్లించిన భగవంత్ సర్కారు నిర్ణయం ఒక ప్రముఖుడి ప్రాణాలు పోయేలా చేసిందన్న విమర్శను మూటకట్టుకునేలా చేసింది.
వివాదాస్పద సింగర్.. కాంగ్రెస్ నేత.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సిద్ధూ మూసెవాలా దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ లోని జవహర్కే అనే గ్రామంలో ఆయన్ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వీఐపీలకు భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు వ్యవధిలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సెక్యురిటీని తొలగించటమే హత్యకు కారణమైందన్న మాట వినిపిస్తోంది. భద్రత తొలగించే క్రమంలో భాగంగా సిద్ధూ మూసెవాలాకు కేటాయించిన సెక్యురిటీని తొలగించారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అతను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో 63వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద సింగర్లలో ఒకరిగా ఆయనకు పేరుంది. మంచి రాపర్ అయిన అతనికి వేలాది మంది అభిమానులు.. మద్దతుదారులు ఉన్నారు. మున్సా జిల్లాలోని మూసెవాలలో 1993లో జన్మించిన అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే సమయంలో సంగీతాన్ని నేర్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం కెనాడకు వెళ్లిన అతను తర్వాతి కాలంలో సింగర్ గా పాపులర్ అయ్యారు.
వివాదాస్పద అంశాలతో పాటలు పాడటం అతని అలవాటు. అతను 18వ శతాబ్దపు సిక్కు వీరుడు బై భాగోపై రాసిన.. 'జట్టి జోనె మోర్హ్ ది బందూక వార్గి' పాట అత్యంత వివాదాస్పదం కావటమే కాదు.. తర్వాతి కాలంలో ఆ పాట పాడినందుకు సారీ చెప్పాడు. గ్యాంగస్టర్లను పొగడటం.. గన్ కల్చర్ ను ప్రమోట్ చేసే ఇతగాడి పాటలపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో అతనికి అభిమానగణం కూడా ఎక్కువే. అలాంటి అతను దారుణంగా హత్యకు గురి కావటం ఇప్పుడు విస్మయానికి గురి కావటమే కాదు.. ఆప్ సర్కారు ఆత్మరక్షణలో పడేలా చేసింది.