Begin typing your search above and press return to search.
లైవ్ లో వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్...నవ్వుతూనే రిప్లై ఇచ్చిన సింగర్ సునీత..!
By: Tupaki Desk | 10 May 2021 8:30 AM GMTటాలీవుడ్ లో సింగర్ సునీత గొప్ప గాయనిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కరోనా కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా కల్లోలంతో జనం నిత్యం తమ ఆత్మీయులను కోల్పోతూ విషాదంలో కోల్పోతున్నారు. కరోనా వ్యాప్తితో నైరాశ్యం లో మునిగి పోయిన వారిని చూసి సింగర్ సునీత చలించిపోయింది. వారికి తన పాటల ద్వారా అయిన కాస్త ఉపశమనం కలిగించాలని నిర్ణయించుకుంది. ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె తన ఫాలోవర్స్ తో లైవ్ లో మాట్లాడుతోంది. కరోనా కు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తోంది. అభిమానులు అడిగిన పాటలను పాడుతోంది. అలాగే వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతోంది.
ఇలా తన పాటలతో, ధైర్యం కలిగించే మాటలతో కొద్ది రోజులుగా అభిమానులకు రిలీఫ్ ఇస్తోంది. కరోనా వ్యాప్తి తీవ్రతరమైన వేళ ఎక్కువగా బయట తిరగొద్దని, అత్యవసరమైతే నేను బయటికి వెళ్లాలని ఆమె సలహాలు ఇస్తోంది. ఎప్పటి లాగే నిన్న సునీత తన ఫాలోవర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది. కొద్దిసేపు అభిమానులు అడిగిన పాటలను పాడింది. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది.
ఆ సమయంలో ఓ నెటిజన్ 'మీ వాట్సాప్ నంబర్ చెప్పండి' అని అడిగాడు. అందుకు సునీత 'సో సారీ అండి' అని నవ్వుతూనే నొప్పించకుండా సమాధానమిచ్చింది. సునీత ఇన్ స్టా లైవ్ ద్వారా అభిమానులు అడిగిన పాటలను పాడటమే కాక, ఆక్సిజన్ తో ఇబ్బంది పడుతున్న వారి వివరాలు, బెడ్ల ఖాళీ వివరాలు చెబుతూ అందరి మనసులు చూరగోంటోంది. సునీత పాటలు పాడటమే కాక జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.