Begin typing your search above and press return to search.
వీల్ చైర్ లోనే సింగర్ తాలిబ్ ఖాన్ మృతి !
By: Tupaki Desk | 11 May 2021 10:41 AM GMTమనిషి కంటికి కనిపించని ఓ సూక్ష్మ జీవి ప్రపంచ దేశాలను వణికిపోయేలా చేస్తుంది. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకంగా తన రూపాన్ని మార్చుకుంటూ తన వ్యాప్తిని కొనసాగిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతీ ఒక్కరూ ఈ మహమ్మారి కారణంగా ఏదో రకంగా ప్రభావితమవుతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కరోనా కాటుకి బలైపోతున్నారు. కరోనా సెకండ్ లో ప్రపంచంలోనే ఏ దేశంలో నమోదు కానటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెకండ్ వేవ్ లో పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకు ఆక్సిజన్ కష్టాలు తప్పడం లేదు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక రాజస్థాన్కు చెందిన ప్రసిద్ధ మంగనియార్ గాయకుడు తాలిబ్ ఖాన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో పడక కోసం దాదాపు రెండు గంటలు వేచి ఉన్న ఆయన, సకాలంలో చికిత్స అందక చివరి శ్వాస విడిచారు. ఆ ఘటనకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మూడు రోజులుగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు.. సోమవారం ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి చేర్చగా అక్కడ పడకలు అందుబాటులో లేవు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే రెండు, మూడు గంటల తర్వాత ఆయనకు బెడ్ దొరికినా అంతలోనే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో పడక కోసం గంటల తరబడి వీల్ ఛైర్ లో వేచి చూసిన ఆయన అక్కడే ప్రాణాలను విడిచారని వారు వెల్లడించారు. సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే తాలిబ్ ను కోల్పోయామని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.