Begin typing your search above and press return to search.
దేశంలో అకృత్యాలకు నిరసనగా సింగర్ టాప్ లెస్ ర్యాంప్ వాక్
By: Tupaki Desk | 19 Nov 2019 7:16 AM GMTచిలీ దేశంలో గత కొన్ని నెలలుగా రాజకీయ అనిశ్చితి మరియు ఆర్థిక అసమానతల ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళలు తీవ్రతరం అయ్యి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పోలీసులు పెల్లట్ గన్స్ తో ఫైర్ చేయడం వల్ల వందలాది మంది కళ్లు పోగొట్టుకున్నారు. ఆందోళనలు చేస్తున్న ఆడవారిని అదుపులోకి తీసుకుని వారిపై అఘాయిత్యానికి అకృత్యాలకు పాల్పడుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దేశంలోని పరిస్థితులపై చిలీ సింగర్ మోన్ లాఫ్తరే ఒక పాట రాసి పాడింది.
ఆ పాటకు గాను ఆమెక విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఒక కార్యక్రమంలో ఈమెకు అవార్డు ఇచ్చేందుకు నిర్వాహకులు ఆహ్వానించారు. అవార్డు తీసుకునేందుకు వచ్చిన సమయంలో నిండైన డ్రస్ తో వచ్చిన మోన్ లాఫ్తరే ఆ తర్వాత ర్యాంప్ వాక్ చేసింది. ర్యాంప్ వాక్ చేస్తూ మద్యలో తన డ్రస్ పై బాగం పూర్తిగా తీసేసి వక్షోజాలను ప్రదర్శించింది. తన వక్షోజాలపై 'చిలీలో టార్చర్ పెట్టి రేప్ చేసి చంపేస్తున్నారు' అంటూ రాసుకుంది.
జనాల్లో అవైర్ నెస్ తీసుకు వచ్చేందుకు తాను ఈ పని చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. దేశంలో ఉన్న దారుణ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడమే తన ఉద్దేశ్యమంది. సామాన్యులు చిలీ దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ఈ పని చేయడం అందరికి షాకింగ్ గా అనిపించింది.
కార్యక్రమ నిర్వాహకులు కూడా ఆమె ఇలా చేయబోతున్నట్లుగా తమకు తెలియదు అంటూ చెప్పారు. అయితే ఆమె ఏదైతే అనుకుందో అదే జరిగింది. చిలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల విషయం ప్రభుత్వం దృష్టికి మరియు ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడ వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.