Begin typing your search above and press return to search.
నీరజ్ చోప్రా స్వర్ణం.. 2011 వరల్డ్ కప్ గెలుపు కంటే గొప్పదన్న బజ్జీ.. గంభీర్ రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 8 Aug 2021 9:50 AM GMTఒక విజయం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు అదే పని చేశారు నీరజ్ చోప్రా. 24 గంటల ముందు అతని పేరును చెప్పి.. అతను ఏ ఆట ఆడతాడు? అని అడిగితే నూటికి 99 శాతం మంది సరైన సమాధానం చెప్పేవారు కాదేమో? తన అత్యద్భుత ప్రతిభతో సరికొత్త రికార్డును క్రియేట్ చేయటమే కాదు.. ఒలింపిక్ స్వర్ణాన్ని సొంతం చేసుకున్న వైనం యావత్ జాతిని ఆనందంలో ముంచెత్తింది. ప్రముఖల నుంచి సామాన్యుల వరకు అందరి నోట నానుతున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో ఫైనల్ లో అతను అందరి కంటే ఎక్కువగా 87.58 మీటర్ల దూరం విసిరి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తటమే కాదు.. స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్ గా నిలిచాడు.
2008 ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా సాధించిన గోల్డ్ తర్వాత స్వర్ణాన్ని సొంతం చేసుకున్న క్రీడాకారుడు నీరజ్ చోప్రానే. శతాబ్దానికి పైనే కంటున్న కలను నిజం చేసి.. స్వర్ణ దాహాన్ని కాస్తంత తీర్చిన క్రీడాకారుడు అతనేనని చెప్పాలి. నీరజ్ ను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఒక డిబేట్ లో టీమిండియా మాజీ క్రికెటర్.. హర్బజన్ సింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీరజ్ విజయం.. 2011లో టీమిండియా సొంతం చేసుకున్న వరల్డ్ కప్ కంటే గొప్పదని పేర్కొన్నాడు. ఆజతక్ చానల్ లో జరిగిన డిబేట్ లో పాల్గొన్న బజ్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బజ్జీ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చినంతనే మరో వెటరన్ క్రికెటర్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ ట్విటర్ లో ఒక ట్వీట్ చేశాడు. ‘హర్బజన్ నువ్వు చెప్పింది నిజమే. కానీ.. మనం ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ.. ఎప్పుడూ చేయొద్దు’ అంటూ సలహా ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా అంటే.. తాజా ఒలింపిక్స ్లో సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న వేళలో.. భావోద్వేగానికి గురైన గంభీర్.. ఆ విజయాన్ని 2011 వరల్డ్ కప్ విజయం కంటే గొప్పదని వ్యాఖ్యానించాడు. అంతే అతన్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. విమర్శల్ని సంధించారు. దీంతో.. బజ్జీ కూడా విమర్శల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారని చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2011లో జరిగిన వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న ఫైనల్ మ్యాచ్ ఆడిన జట్టులో ఈ ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గంభీర్ 97 పరుగులు సాధించిన అద్భుత ఇన్నింగ్స్ తో జట్టు గెలుపులో కీలకభూమిక పోషించాడు. కాకుంటే సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలవటంతో అతను సాధించిన పరుగులు పెద్దగా ఫోకస్ కాలేదు. రావాల్సినంత పేరు రాలేదనే చెప్పాలి. హర్బజన్ కూడా జట్టు గెలుపులో కీలకమే. అలాంటి వారిద్దరు.. తాము సాధించిన విజయం కంటే.. పురుషుల హాకీ జట్టు.. నీరజ్ చోప్రా విజయమే గొప్పదని వ్యాఖ్యానించటానికి ఒక కారణం ఉంది.
దేశంలో క్రికెట్ మతం లాంటిది. దానికి కల్పించే వసతులు.. పెట్టే ఖర్చుతో పోల్చినప్పుడు మిగిలిన క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యత.. వారి కోసం పెట్టే ఖర్చు.. కల్పించే సదుపాయాలు అంతంతమాత్రమే. అలాంటి పరిస్థితుల్లో కూడా అత్యత్తుమ విజయాన్ని సొంతం చేసుకోవటం గొప్పే కదా? ఈ ఉద్దేశంతో వారు స్పందిస్తే.. నెటిజన్లకు మాత్రం వారి వ్యాఖ్యలు నచ్చట్లేదు. ఈ కారణంతోనే బజ్జీకి గంభీర్ ట్వీట్ సలహా ఇచ్చారని చెప్పాలి.