Begin typing your search above and press return to search.
దేశంలో సింగిల్ డోసు టీకా.. డీసీజీఐ ఆమోదం
By: Tupaki Desk | 7 Feb 2022 11:30 PM GMTదేశంలో మరో వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదముద్ర వేసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ లైట్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. దీంతో భారత్ లో అనుమతి పొందిన మొత్తం టీకాల సంఖ్య 9కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశం కొవిడ్ పై చేస్తున్న పోరులో మరో వ్యాక్సిన్ వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. దీంతో కొవిడ్ ను అదుపు చేయడం మరింత సులువని అభిప్రాయపడ్డారు.
భారత్ లో ఇప్పటికే కేంద్రం 8 టీకాలకు అత్యవసర అనుమతి ఇచ్చింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, కార్బెవాక్స్, కోవావాక్స్, జైడస్ క్యాడిలా, స్పూత్నిక్ వీ టీకాలకు డీసీజీఐ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన స్పుత్నిక్ లైట్ టీకా రష్యాకు చెందింది. భారత్ లో అనుమతి పొందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ లో జాన్సన్ అండ్ జాన్సన్ మొదటిది కాగా ఇది రెండోదిగా అధికారులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి గతంలోనే భారత ఔషధ నియంత్రణ మండలికి నిపుణులు కమిటీ సిఫార్సు చేసింది. అయితే సిఫార్సు చేసిన కేవలం వారం రోజులోపే ఈ టీకా డీసీజీఐ ఆమోదం లభించింది. ఈ టీకాను కూడా ఇప్పటికే భారత్ లో ఆమోదం తెలిపిన రెండు డోసుల టీకా అయిన స్పుత్నిక్ వి తయారు చేసిన సంస్థ రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్ రూపొందించింది. మొదటిది రెండు డోసుల వ్యాక్సిన్ కాగా.. మరోకటి మాత్రం సింగిల్ డోసు వ్యాక్సిన్.
మూడో వేవ్ లో కొవిడ్ కేసులు సంఖ్య భారీగా పెరగడంతో వ్యాక్సిన్ ల అనుమతులను కేంద్ర వేగవంతం చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ ల ఉత్పత్తిపై అధిక భారం పడుతున్న కారణంగా మిగతా టీకాలకు కూడా అనుమతులు తప్పనిసరి అయ్యాయి. స్పుత్నిక్ లైట్ ను తీసుకువచ్చిన కంపెనీ నుంచి ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వీ రెండు డోసుల వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం గతేదాడి ఏప్రిల్ లో అనుమతి ఇచ్చింది. అయితే పంపిణీకి కొంత సమయం తీసున్న అధికారులు జూన్ నెలలో ఈ టీకా పంపిణీని ప్రారంభించారు.
ఈ టీకాల రెండింటిలో వ్యత్యాసం ఉంటుంది. ఒకటి రెండు డోసులది అయితే మరోకటి మాత్రం ఒక్క డోసుది. ఇదిలా ఉంటే కొవిడ్ పై వీటి ప్రాభావాన్ని పరిశీలిస్తే రెండు డోసుల స్పూత్నిక్ వి ప్రభావం ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ అధ్యయనం తెలిపింది.