Begin typing your search above and press return to search.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే అంతే సంగతులా?
By: Tupaki Desk | 1 July 2022 4:30 PM GMTశుక్రవారం నుండి అమల్లోకి వచ్చిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడితే అంతే సంగతులు. సింగిల్ యూజ్ వస్తువులు వాడుతు పట్టుబడితే జరిమానా, జైలుశిక్ష, లేకపోతే రెండూ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాస్టిక్ కారణంగా పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణలో భాగంగాన కేంద్రం ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లిస్టిక్ ను దేశవ్యాప్తంగా నిషేధం విదించింది. ఈ నిషేధం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చేసింది.
ముదు నిషేధం వేటిపైన ఉందో చూద్దాం. ప్లాస్టిక్ పుల్లలున్న ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, పిప్పర్ మెంటుకు వాడే ప్లాస్టిక్ పుల్లలు అంటే లాలీపాప్ లాంటికి వాడే పుల్లలన్నమాట.
ఐస్ క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, చెంచాలు, స్ట్రాలు, వేడి పదార్ధాలు, స్వీట్ ప్యాకెట్ల ప్యాకింగుకు వాడే పలుచని ప్లాస్టిక్ రేపర్లు, సిగిరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్ లోపు ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు అన్నమాట.
వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్, బంక, గాజు, లోహాలు, స్టెయిన్ లెస్ స్టీల్, వెదురు, చెక్కతో పాటు పర్యావరణానికి హానికలిగించని వాటిని ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్లాస్టిక్ వేస్ట్ మ్యానేజ్మెంట్ అమెండ్ మెంట్ రూల్స్-2021 ప్రకారం తక్షణమే నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
ఇక కేంద్రం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందో చూద్దామా ? తయారుచేయటం, దిగుమతి చేసుకోవటం, నిల్వచేయటం, పంపిణీ చేయటం వీటిల్లో ఏదైనా సరే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమేనట.
ఐదేళ్ళవరకు గరిష్టంగా జైలుశిక్ష విధించవచ్చు. లేదా లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. లేదంటే రెండుకూడా విధించవచ్చట. ఒకసారి శిక్షపడిన తర్వాత మళ్ళీ నిబంధనలను ఉల్లఘింస్తే రోజుకు రు. 5 వేలు జరిమాన కట్టాల్సుంటుంది.