Begin typing your search above and press return to search.
రాజయ్య అరెస్ట్
By: Tupaki Desk | 4 Nov 2015 9:58 AM GMTమాజీ ఎంపీ, వరంగల్ లోక్ సభ అభ్యర్తిత్వం నుంచి ఈ రోజు ఉదయాన్నే తప్పుకొన్న సిరిసిల్ల రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి నేపథ్యంలో పోలీసులు రాజయ్య కుటుంబ సభ్యులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కోడలు సారిక - ముగ్గురు చిన్నారుల మృతిపై వారిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్య ఇంటి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రాజయ్య - భార్య మాధవి - రాజయ్య కొడుకు అనిల్ ఉన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఇంకా అధికారికంగా అరెస్టు చూపలేదు. ముగ్గురినీ పోలీసు స్టేషన్ కు తరలించి ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
సారిక మృతి నేపథ్యంలో క్లూస్ టీం అక్కడ ఆధారాలు సేకరిస్తోంది. సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమయిందని.. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి రాజయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం దొరికినా ఆయన చిక్కుకున్నట్లే.
మరోవైపు కోడలు - ముగ్గురు మనుమల మృతి నేపథ్యంలో రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ - వివేక్ - మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ పరామర్శించారు. ఈ ఘటనతో వరంగల్ ఉప ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రాజయ్య బరి నుంచి తప్పుకోవడంతో సర్వే సత్యనారాయణ హడావుడిగా నామినేషన్ వేయాల్సివచ్చింది. తాజా ఘటన రాజయ్యకే కాకుండా కాంగ్రెస్ కూ మచ్చ తెచ్చిందని కాంగ్రెస్ నేతలు లోలోన అనుకుంటున్నారట.