Begin typing your search above and press return to search.
రాజయ్య ఇంట్లో అగ్నిప్రమాదం..
By: Tupaki Desk | 4 Nov 2015 3:37 AM GMTఅనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు.. ముగ్గురు మనమళ్లు మృతి చెందటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజయ్య నివాసంలోని మొదటి అంతస్థులో ఈ ప్రమాదం చోటు చేసకుంది.
మొదటి అంతస్థులో ఉదయం ఆరున్నర గంటల సమయంలో భారీగా పొగలు వ్యాపించాయి. కోడలు సహా ముగ్గురు మనమళ్లు మరణించటంతో రాజయ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రాజయ్య కుమారుడు అనిల్ కు ఇంట్లోనే ఉన్నట్లు చెబుతున్నారు.
అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది. రెండంతస్తుల భవనంలో ఇంత ఘోర అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అన్న అంశంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. అగ్నిప్రమాదం సంగతి తెలిసిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గతంలో రాజయ్యపై ఆయన కోడలు వరకట్న వేధింపుల ఆరోపణలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజయ్య కుమారుడు అనిల్ తోసారిక వివాహం 2006లో జరిగింది. కొద్ది నెలల కిందటే తన భర్త అనిల్ పై సారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలైన రాజయ్య.. ఆయన భార్య తనను వేధిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. అత్తమామలపై ఆరోపణలు చేసిన తర్వాత కూడా భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు రాజయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం బయటకు రావాల్సింది ఉంది. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నిక జరుగుతున్న ప్రస్తుత తరుణంగా ఇలాంటి భారీ ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది.