Begin typing your search above and press return to search.

మ‌ల్లాది విష్ణు ఆస్తులు రూ.600కోట్లు!

By:  Tupaki Desk   |   25 Jan 2016 7:42 AM GMT
మ‌ల్లాది విష్ణు ఆస్తులు రూ.600కోట్లు!
X
రెండు తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన క‌ల్తీ మ‌ద్యం కేసు ఉదంతం గురించి తెలిసిందే. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లాది విష్ణుకు సంబంధం ఉంద‌న్న ఆరోప‌ణ‌లున్న క‌ల్తీ మ‌ద్యం కేసులో ఆయ‌న్ను ఏ9గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి క‌ల్తీ మ‌ద్యం అమ్మిన బార్ లో మ‌ల్లాది విష్ణుకు సంబంధం ఉందా? లేదా? అన్న విష‌యంపై ఆరా తీసేందుకు వీలుగా అధికారులు దృష్టి సారించారు. క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారంపై నియ‌మించిన సిట్ బృందం మ‌ల్లాది విష్ణు ఆస్తుల మీద ఫోక‌స్ చేయ‌టంతో ఇప్పుడు ఆయ‌న ఆస్తుల తాలూకు వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల ద‌ర్యాప్తు ముగించిన సిట్‌.. మ‌ల్లాది విష్ణు ఆస్తుల‌కు సంబంధించిన ఒక భారీ నివేదిక‌ను ఈడీకి పంపిన‌ట్లుగా చెబుతున్న వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. విజ‌య‌వాడ కార్పొరేట‌ర్ గా కెరీర్ షురూ చేసిన మ‌ల్లాది విష్ణు రాజ‌కీయంగా అంచ‌లంచెలుగా ఎదిగారు. అయితే.. ఆయ‌న కార్పొరేట‌ర్ గా పోటీ చేసిన స‌మ‌యంలో ఆయ‌న స‌మ‌ర్పించిన ఆస్తుల అఫిడ‌విట్ ను ఈ మ‌ధ్య కాలంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా దాఖ‌లు చేసిన ఆస్తుల అఫిడ‌విట్ ను స‌రిపోల్చ‌టం.. ఆస్తులు ఏ మేర వృద్ధి చెందాయా? అన్న అంశంపై ఫోక‌స్ పెట్టిన అధికారులు ఆయ‌న ఆస్తుల‌పై భారీగా వివ‌రాలు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మ‌ల్లాది విష్ణు ఆస్తులు దాదాపుగా రూ.600కోట్లుగా తేల్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోనే ఆయ‌న‌కు దాదాపు 28 ఎక‌రాల భూమి ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవి కాక‌.. ఆయ‌న పేరిట‌.. ఆయ‌న బినామీల పేరిట భారీగా ఆస్తుల్ని కూడ‌బెట్టిన విష‌యాన్ని సిట్ గుర్తించింద‌ని.. తాజా విచార‌ణ‌లో ఆ అంశాల‌కు సంబంధించిన వివ‌రాల్ని సేక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. క‌ల్తీ మ‌ద్యం కేసులో ఆయ‌న్ను ప్ర‌శ్నించిన సిట్ అధికారులు.. విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న ఆస్తుల‌పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌టం కూడా ఇందుకు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. క‌ల్తీ మ‌ద్యం కేసుతో మొద‌లైన క‌ష్టాలు.. తాజా ప‌రిణామాలు చూస్తే మ‌ల్లాది విష్ణుకు మ‌రిన్ని తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.