Begin typing your search above and press return to search.

విశాఖ భూస్కామ్ పై ముగిసిన సిట్ విచారణ ... త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక !

By:  Tupaki Desk   |   22 Dec 2020 1:00 PM GMT
విశాఖ భూస్కామ్ పై ముగిసిన సిట్ విచారణ ... త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక !
X
గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న విశాఖ భూ కుంభకోణంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్‌ , ఆ సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు వెల్లడించింది. విచారణ పూర్తిఅయినట్లు సిట్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ మంగళవార వెల్లడించారు. కరోనా కారణంగా విచారణ కొంతమేర ఆలస్యమైందని, సీఎంఓ ఆఫీస్ నుండి పిలుపు రాగానే నివేదికను అందిస్తామని , ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పూర్తి నివేదిక సిద్ధం చేశామని తెలిపారు.

ప్రభుత్వ భూములు కేటాయింపులు, రికార్డులు ట్యామ్ పరింగ్, ఎన్ ఓ సీ జారీ, 22A భూములు అక్రమాలు జరిగాయని వెల్లడించారు. మొత్తం 350 నుంచి 400 ఎకరాల్లో భూములు అక్రమాలు జరినట్లు గుర్తించామన్నారు. 22A నిషేధిత భూములు విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఉడా బహిరంగ వేలం వేసి అమ్మిన 10 ఎకరాలు భూమిని 22 A నిషేధిత భూముల్లో చేర్చారని అన్నారు. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. రెవెన్యూ అధికారులు సహకారంతో చాలా అక్రమాలు పాల్పడ్డారని చెప్పారు.

22A భూములు విషయంలో స్పష్టమైన పరిష్కరంతో పాటు సిట్‌ ద్వారా సూచనలు కూడా చేస్తున్నామన్నారు. సిట్‌ విచారణపై కమిటీ సభ్యురాలు వైవీ అనురాధ మాట్లాడుతూ.. సిట్ దృష్టికి 1340 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ రిపోర్ట్స్ జతచేసి ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదికలో ఇచ్చాము. నిషేధిత భూములు 22 A లో చాలా అక్రమాలు జరిగాయి. 500 పైగా రెవెన్యూ రికార్డులు తారు మారు చేశారు. 300 కు పిటిషన్లు పైగా 22 A నిషేధిత భూములు అక్రమాలు జరిగాయి అని వెల్లడించారు. ఇక ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన తర్వాత , ఆ నివేదిక పై ప్రభుత్వం ఏ విధంగా ముందుకుపోతుంది , ప్రతిపక్షం దానిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.