Begin typing your search above and press return to search.
'తన' వాళ్ల నుంచి మొదలుపెడ్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 5 Oct 2016 5:14 AM GMTగ్యాంగ్ స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతం అవుతోంది. నయీంతో సంబంధం ఉన్న వారిలో టీఆర్ ఎస్ నేతలు ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో....ముందుగా పార్టీ నేతల సంగతి చూసే దిశగా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నయీం ముఖ్య అనుచరుల్లో ఒకరైన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన టీఆర్ ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ భాగ్ అంబర్ పేట లోని వైభవ్ నగర్ లో నివాసముంటున్న చింతల వెంకటేశ్వర్ రెడ్డి కొంతకాలం నుంచి బెంగుళూరులో ఉంటున్నట్టు తెలిసింది. నయీం ఎన్ కౌంటర్ తరువాత వెంకటేశ్వర్ రెడ్డి కర్ణాటకలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నయీంతో ఆర్థిక లావాదేవీలు - భూ దందాలు జరిపాడని చింతలపై ఆరోపణలు రావడంతో సిట్ విచారణ జరిపింది. ఆయన నుంచి నయీంకు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ రాబట్టింది. ఇదిలాఉండగా చింతల భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత టీఆర్ ఎస్ లో చేరారు. మరోవైపు నయీం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు అరెస్టయిన వారిలో నయీం అనుచరుల పేర్లను వెల్లడించిన సిట్ నేడో - రేపో నయీంకు సహకరించిన పోలీస్ అధికారులు - రాజకీయ నాయకుల పేర్ల జాబితాను వెల్లడించనున్నట్టు తెలిసింది. నయీం వ్యవహారంలో ఇప్పటి వరకు 155 కేసులు నమోదు కాగా - 95 మందిని అరెస్టు చేశారు. 8మంది లొంగిపోయారు. ఇంకా 95 మందికి పిటీ వారెంట్లు జారీ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/