Begin typing your search above and press return to search.
ఖాకీ డౌట్స్ : ఒకే లాయర్ ట్రైనింగిచ్చాడా?
By: Tupaki Desk | 21 July 2017 4:55 PM GMTతెలుగు సినిమా పరిశ్రమకు డ్రగ్స్ రాకెట్లతో ఉన్న లింకుల గురించి వాస్తవాలను తెలుసుకోవడానికి మూడు రోజులుగా వేర్వేరు నిందితుల్ని విచారిస్తున్న పోలీసులకు చిరాకు పుడుతోందిట. కెల్విన్ ద్వారా తెలిసిన సమాచారాల్ని బట్టి నోటీసులు పంపిన ప్రముఖులను రోజుకు ఒకరు వంతున పిలిపించి.. అధికారులు విచారిస్తున్నారు. మూడురోజులుగా వేర్వేరు క్రాఫ్ట్ లకు చెందిన ముగ్గురిని విచారిస్తున్నప్పటికీ.. వస్తున్న సమాధానాలు మాత్రం ఒకే తీరుగా ఉంటూ.. పోలీసులకు విసుగు తెప్పిస్తున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. నిందితులు న్యాయవాదుల్ని సంప్రదించి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుని వచ్చి - ఆ మేరకే చాలా జాగ్రత్తగా తమ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారట. ఇంకా చెప్పాలంటే.. నిందితులు అందరికీ ఒకే లాయర్ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తోందని వారు భావిస్తున్నారట.
నిజానికి డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ప్రముఖుల పాత్ర చాలా పరిమితమైనది. ఈ డ్రగ్స్ వినియోగంతో ప్రమేయం ఉన్న పెద్దచేపలు సినిమాయేతర రంగాల్లో చాలా మందే ప్రముఖులు ఉన్నారు. పైగా ఇవాళ ఒకే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే నలుగురు ప్రముఖుల పిల్లలు డైరక్ట్ గా డార్క్ వెబ్ సైట్ నుంచి ఇళ్లకే డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లుగా పోలీసులు తేల్చారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.. గానీ, ఆ ప్రముఖుల పేర్లేమీ ప్రపంచానికి తెలియలేదు. ఇదే తీరుగా ఎన్ని రంగాల్లో డ్రగ్ వ్యసన పరులు ఉన్నప్పటికీ.. సినిమా వాళ్లు మాత్రమే జనం నోళ్లలో నానుతూ.. భ్రష్టు పట్టేలా పోలీసుల విచారణ తీరు సాగుతోంది. ఇదంతా ఒక పార్శ్వం అయితే పోలీసుల అభిప్రాయంలో విచారణకు వస్తున్న వారంతా.. విచారణను ఎలా ఎదుర్కోవాలో.. ఎలా సమాధానాలు ఇవ్వాలో .. పక్కా ట్రైనింగ్ తో వస్తున్నారని అనుకుంటున్నారుట!
డ్రగ్స్ కేసుల్లో నిర్దిష్టమైన శిక్షలు పడే అవకాశాలు తక్కువ. నిషేధిత డ్రగ్స్ అమ్మడం అనే నేరానికి, వాడడం అనే నేరానికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వాడిన అలవాటు ఉంది గానీ.. అమ్మకాలు, ఇతరులకు ఇవ్వడం అలవాటు లేదని చెప్పినా నిందితులు సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లే అనేది కొందరు నిపుణుల అభిప్రాయం. పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించినా సరే.. డ్రగ్స్ వాడిఉంటే ఆ దాఖలాలు దొరుకుతాయే తప్ప.. ఇతరులకు అమ్మడం లాంటి పనులు చేసినట్లు ఆధారాలు సంపాదించడం క్లిష్టమైన వ్యవహారం. పైగా నేరాల తీవ్రతకు, పడే శిక్షలకు ఉండే ఈ వ్యత్యాసాలను నిందితులు అర్థం చేసుకుని తదనుగుణంగా జవాబులు చెబితే వారికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అందరూ ఆ తరహాలో చెబుతున్నారు గనుకనే.. ఒకే లాయర్ వీరందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నట్లుగా ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నట్లు అనుకుంటున్నారు.