Begin typing your search above and press return to search.
నిర్వాహకుల గుండెల్లో ‘పబ్’డబ్ పబ్ డబ్
By: Tupaki Desk | 22 July 2017 6:10 AM GMT సంచలనం గా మారిన డ్రగ్స్ వ్యాపారానికి పబ్బులే ప్రధాన కేంద్రాలంటూ వస్తున్న ఆరోపణలపై అసలు సంగతి తేల్చేందుకు అధికారులు కదిలారు. పబ్బుల్లోనే డ్రగ్స్ సరఫరా ఎక్కువగా జరుగుతోందని... అవే సరఫరాకు ప్రధాన కేంద్రాలని భావిస్తున్న నేపథ్యంలో నగరంలోని పబ్ లు - బార్ల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్ లపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు దొరికితే వాటి మూసివేతకు ఆదేశాలు వెలువడడం ఖాయమని తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఇచ్చే నివేదికపైనే వీటి భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో నిర్వాహకుల్లో టెన్షన్ మొదలైంది.
కెల్విన్ ముఠా పట్టుబడ్డ తర్వాత జరిగిన దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మత్తుమందులు వాడుతున్న అనేక మందిని పిలిపించి విచారించారు. వారిలో చాలామంది తమకు పబ్బుల్లోనే మత్తుమందుల వాడకం అలవాటైందని చెబుతూ ప్రత్యేకంగా కొన్ని పబ్బుల పేర్లు చెప్పారు. ఇవే ఆరోపణలపై గతంలో కొన్ని పబ్బుల్ని మూసివేశారు. నోటీసులు ఆబ్కారీ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 16 పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. ఆ 16 పబ్బుల యాజమాన్యాలతోపాటు నగరంలోని బార్ల యాజమాన్యాలను కూడా సమావేశానికి పిలిచారు. కొద్దిసేపటి కిందట ఆబ్కారీ కార్యాలయంలో ఈ సమావేశం మొదలైంది.
సిట్ బృందం గ్రేటర్ పరిధిలోని 17 పబ్బులకు నోటీసులు జారీ చేసింది. ప్లేబాయ్ - బీఅండ్ సీ - ఎయిర్ - రన్స్ - స్టోన్ వాటర్స్ - ఓవర్ ది మూన్ - హార్ట్ కప్ కాఫీ - బీట్స్ పెర్ మినిట్ - కిస్మత్ తదితర పబ్ లకు నోటీసులు అందాయి. ఇందులో కొందరు నిర్వాహకులు ఇప్పటికే సిట్ బృందంతో సమావేశానికి వచ్చారు.