Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దుతో పెద్ద కామ్రేడ్ షాక్‌

By:  Tupaki Desk   |   15 Nov 2016 5:54 AM GMT
నోట్ల ర‌ద్దుతో పెద్ద కామ్రేడ్ షాక్‌
X
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన రూ. 500 - రూ. 1,000 నోట్లను ర‌ద్దుచేసిన నేప‌థ్యంలో సామాన్యుల‌తో పాటు మాన్యుల‌కు సైతం తీవ్ర స్థాయిలో ఇక్క‌ట్లు ఎదుర‌వుతున్నాయి. అది కూడా ఒక సంద‌ర్భం లేదా ఒక‌రోజుకో ప‌రిమితం కావ‌డం లేదు. నాలుగైదు రోజుల పాటు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. సీపీఎం జాతీయ‌ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ త‌న‌కు ఎదురైన ఇబ్బందుల‌ను వివ‌రించారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారనీ - సంపన్నులకు నిద్ర మాత్రలు అవసరం అవుతున్నాయనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.

"పేదలు హాయిగా నిద్రపోతున్నారనీ - సంపన్నులకు నిద్రమాత్రలు అవసరమవుతున్నాయనీ ప్రధాని అన్నట్టు నేను విన్నాను. వాస్తవికతకు కొన్ని నక్షత్ర మండలాల దూరంలో ప్రధాని ఉన్నారే త‌ప్ప భూ మండ‌లంపై లేరని నేను భావిస్తున్నాను. నోట్ల రద్దుకు పది నెలల ముందు నుంచీ సన్నాహాలు చేస్తున్నట్టయితే, ప్రజలు లాంటి సన్నద్ధం లేకుండా ఎందుకున్నట్టు?” అని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 2,000 నోటుతో తాను నాలుగు రోజుల్నించి తిరుగుతున్నాననీ, దాన్ని ఎవరూ తీసుకోవడం లేదనీ - రైల్లో భోజనం కొనుక్కోలేకపోతున్నాననీ, ఆఖరికి రోడ్డుపక్క కప్పు టీ తాగలేగపోతున్నానని ఏచూరి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాత నోట్ల‌ను వినియోగించడానికి డిసెంబర్‌ 31వ తేదీవరకూ అనుమతించి సామాన్యులకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ”బహిరంగ - ప్రభుత్వపరమైన వినియోగాలకోసం పాత నోట్లను డిసెంబర్‌ 31 వరకూ అనుమతించాలి. తద్వారా ప్రజలకు ఊరట కలిగించాలి” అని సీతారా ఏచూరి కోరారు. విదేశాల్లో 90శాతం నల్లధనాన్ని దాచుకున్నవారి పేర్లు ప్రధాని మోడీకి తెలుసనీ - కానీ వాటిని బహిర్గతం చెయ్యడం లేదనీ ఆయన ఆరోపించారు. ”ఉగ్రవాదానికి నిధులివ్వడనికి ఎవరూ సంచులతో డబ్బు మోసుకెళ్ళరు. అవి ఆన్‌లైన్‌ బదిలీలద్వారా జరిగిపోతాయి. కొత్త కరెన్సీని ఎవరూ తీసుకోవడం లేదు. మరి వాటిని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించారు.

ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ సైతం త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. "బ్యాంకుల బయట పడిగాపులు పడుతున్నది పేదలు - ప్రశాంతంగా నిద్రపోతున్నది మోడీ స్నేహితులు” అని వ్యాఖ్యానించారు. ”ప్రధాని వ్యాఖ్యలు సామాన్యులను అవమానపరిచేవిగా, దురుద్దేశపూరితంగా ఉన్నాయి” అని పశ్చిమబెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ట్విటర్‌లో విమర్శించారు. తనను ‘క్వీన్‌ ఆఫ్‌ శారదా (కోట్లాది రూపాయల చిట్‌ ఫండ్‌ కుంభకోణం సూత్ర‌ధారి )’ అంటూ బిజెపి అభివర్ణించడాన్ని కూడా ఆమె ఖండించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/