Begin typing your search above and press return to search.

అవిశ్వాసం నోటీస్ ఇస్తాం..కేసీఆర్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తాం

By:  Tupaki Desk   |   30 March 2018 4:59 PM GMT
అవిశ్వాసం నోటీస్ ఇస్తాం..కేసీఆర్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తాం
X
తెలుగు రాష్ర్టాల ప‌రిణామాల‌పై సీపీఎం ఆస‌క్తిక‌రంగా పరిశీలిస్తోంది. అంతేకాకుండా ఆయా పార్టీల నేత‌ల ప‌రిణామాల‌కు త‌గిన రీతిలో త‌మ రాజ‌కీయ ముంద‌డుగు వేస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ - టీడీపీ - కాంగ్రెస్‌ తో పాటు తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వనున్నట్లు సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరి తెలిపారు. కేంద్ర క‌మిటీ స‌మావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల్లో భాగంగా పొలిట్‌బ్యూరో రూపొందించిన పార్టీ సంస్థాగత ముసాయిదా నివేదికపై నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా సీతారం ఏచూరి మాట్లాడుతూ....రెండు వారాలుగా టీడీపీ - వైసీపీలు కేంద్రంపై అవిశ్వాసం ఇస్తున్నాయని అయితే తప్పించుకునే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోందన్నారు. మిగతా పార్టీలతో పాటు తాము కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తున్నామన్నారు. చర్చ జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా హామీ సహా బీజేపీ వైఫల్యాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌ లో అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నట్లు ఏచూరి వెల్లడించారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న జాతీయ రాజ‌కీయాల ముందడుగుపై సీపీఎం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ విషయంలో త‌మ‌తో చ‌ర్చించేందుకు కేసీఆర్ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్ఆర‌ని అన్నారు. అయితే తాము ఇంకా ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించలేదని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా, ఏప్రిల్ నెల‌లో సీపీఎం ముఖ్య‌నేత‌ల‌తో ఆయ‌న‌భేటీ కానున్నార‌ని స‌మాచారం.