Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చెయ్యేస్తే కానీ కామ్రేడ్ ఎంపీ కాలేరా?

By:  Tupaki Desk   |   23 April 2017 10:09 AM GMT
కాంగ్రెస్ చెయ్యేస్తే కానీ కామ్రేడ్ ఎంపీ కాలేరా?
X
దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు కష్టకాలం కొనసాగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం కష్టమవుతుండడంతో కనీసం పెద్దల సభలో కొనసాడం కూడా అనిశ్చితో పడుతోంది. పశ్చిమబెంగాల్ లో బాగా చితికిపోవడంతో ఆ పార్టీ పెద్దలు కనీసం పెద్దల సభలో కంటిన్యూ కావాలన్నా ఎవరు సాయం చేస్తారా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికే ఇలాంటి సమస్య ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ చెయ్యేస్తే మరో ఆరేళ్లు పెద్దల సభలో తమ వాణి వినిపించవచ్చని వారు అనుకుంటున్నారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరొక పర్యాయం రాజ్యసభకు ఎంపిక కావడానికి కాంగ్రెస్‌ పార్టీ తన సహకారాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో సిపిఎం ఎమ్మెల్యేలు 26 మంది మాత్రమే ఉన్నారు. దీనితో సీతారం ఏచూరి రాజ్యసభకు ఎంపిక కావడం కష్టం. అయితే కాంగ్రెస్‌ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా సీతారాం ఏచూరికి మద్దతు ఇస్తే ఆయన రాజ్యసభకు సునాయాసంగా ఎంపిక అవుతారు.

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌ డిఎ ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించగలిగే వ్యక్తిగా సీతారం ఏచూరి గుర్తింపు పొందారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకమవ్వాల్సిన తరుణంలో పార్లమెంటులో ఏచూరి ఉండటం అవసరమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/