Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఓట్ల లెక్కింపులో సిత్రం.. ఆమెకు ‘18’లోపే.. ఆయన ‘17’లోపే

By:  Tupaki Desk   |   19 March 2021 8:15 AM GMT
హైదరాబాద్ ఓట్ల లెక్కింపులో సిత్రం.. ఆమెకు ‘18’లోపే.. ఆయన ‘17’లోపే
X
రోజుల తరబడి సాగుతున్నహైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సా..గుతూనే ఉంది. ముచ్చటగా మూడో రోజున సాగుతున్న ఓట్ల లెక్కింపును చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇప్పటికే ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు హాట్ టాపిక్ గా మారాయి. రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న చెల్లని ఓట్లు టీఆర్ఎస్ నేతలకు బీపీని తెప్పిస్తున్నాయి. తమకు పడాల్సిన ఓట్లు మొత్తం చెల్లని రూపంలో మారిన వైనంపై వారి వేదన అంతా ఇంతా అన్నట్లు మారింది.

ఇప్పటివరకు వెల్లడైన ఆరురౌండ్ల ఓట్ల లెక్కింపులో ఒక అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎన్నిక ఏదైనా.. ఓట్ల లెక్కింపు రౌండ్ రౌండ్ కు ఒకేలాంటి పరిస్థితి అస్సలు ఉండదు. అందుకు భిన్నంగా తాజా ఎన్నికల్లో అలాంటి పరిస్థితి నెలకొంది. మొదటి రౌండ్ నుంచి రెండో రౌండ్ వరకు ఏ రౌండ్ లోనూ వాణీదేవికి వచ్చిన ఓట్లు 18వేల లోపు మాత్రమే ఉండటం గమనార్హం. అత్యధికంగా మూడో రౌండ్ లో 17836 ఓట్లు వస్తే.. అత్యల్పంగా ఆరో రౌండ్ లో17406 ఓట్లు వచ్చాయి.

ఇలాంటి పరిస్థితి ఒక్క వాణిదేవి విషయంలోనే కాదు.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విషయంలోనూ చోటు చేసుకుంది. ఇప్పటికి ప్రకటించిన ఆరు రౌండ్లలో ఆయనకు ఏ ఒక్క రౌండ్ లోనూ 17వేల మార్కును టచ్ చేయలేదు. 16వేల చిల్లర ఓట్లే వచ్చాయి. ఆరు రౌండ్లలో అత్యధికంగా ఐదో రౌండ్ లో అత్యధికంగా 16750 ఓట్లు రాగా.. అత్యల్పంగా రెండో రౌండ్ లో 16005 ఓట్లు వచ్చాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లు

రౌండ్ వచ్చిన ఓట్లు
1 17439
2 17732
3 17836
4 17545
5 17752
6 17406

బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లు
రౌండ్ వచ్చిన ఓట్లు
1 16385
2 16173
3 16005
4 16436
5 16750
6 16335