Begin typing your search above and press return to search.
ఎవరిది సక్రమం.. ఎవరిది విక్రమం... సభ గాడితప్పిన విధం ఏంటి?
By: Tupaki Desk | 20 Nov 2021 8:30 AM GMTఅసెంబ్లీ.. అంటే.. ఆ రాష్ట్ర ప్రజానీకం.. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఒక్కచోట చేరి.. ప్రజల బాగోగులపై చర్చించే పవిత్రమైన వేదిక. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు సభ అంటే.. రాజకీయ కుట్రలకు.. కుతంత్రాలకు.. విపక్షాలను టార్గెట్ చేయడానికి ఎంచుకున్న వేదికలుగా మారిపోయాయి. మరి దీనికి బీజం ఎక్కడ పడింది? ఎలా పడింది? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానం దరిమిలా.. అసలు సభలు ఎప్పుడు ఎక్కడ దారితప్పాయ్! అనే విషయం ఆసక్తిగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో.. తొలుత సభలు గాడి తప్పింది.. తమిళనాడులో. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంను కట్టడి చేసేందుకు అప్పటి అధికార పక్షం డీఎంకే వేసిన దూకుడు అడుగులు తొలిసారి సభా మర్యాదలను మంటగలిపేలా చేశాయి.
జయలలిత చీరలాగుడు అనేది.. దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇక, దాని తర్వాత.. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఏకంగా.. సభాపతినే కొట్టేందుకు ఒక ఎమ్మెల్యే వెళ్లడం.. మరింత వివాదానికి దారితీసి.. గవర్నర్ జోక్యం వరకు వెళ్లింది. ఇక, ఆ తర్వాత..కర్ణాటకలోనూ.. ముఖ్యమంత్రిని విపక్ష నాయకులు బెదిరించే పరిస్థితి వచ్చింది. ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విమర్శలు చేసుకోవడం.. ప్రతివిమర్శలు చేసుకునేందుకు సభను వినియోగించుకోవడం .. వంటివి రాజకీయంగా తీవ్ర వివాదానికి దుమారానికి చట్టసభలు వేదికలుగా మారాయి. ఇక, ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే.. అధికారం కోల్పోవడం.. కాంగ్రెస్‌కు తీవ్ర ఇబ్బందిగా మారి.. అప్పటి అన్నగారు ఎన్టీఆర్‌పై సభలోనే కారాలు మిరియాలు నూరిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. ఎవరూ కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు. ఇక, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత నుంచి ఉమ్మడి సభ.. రచ్చకుదారి తీసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గవర్నర్ ప్రసం గం ప్రతులను చించేసి.. గాలిలో ఎగరేయడం.. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునాఅడ్డు తగలడం..వంటి చర్యలు చూడాల్సి వచ్చింది. ఇక, రాష్ట్ర విభజన కోసం పట్టుబట్టిన తెలంగాణ ఎమ్మెల్యేలు.. తొలిసారి సభలోనే సన్నాసి.. అని.. ఇతరత్రాదూషణలకు దిగారు. ఇవి అప్పట్లో సంచలనం సృష్టించినా.. ఇప్పుడు షరా.. అన్నట్టుగా మారిపోయాయి. అయినప్పటికీ.. వ్యక్తిగత విషయాలపై ఎవరూ విమర్శించుకోలేదు.
ఇక, విభజిత ఏపీలో పరిస్థితిని గమనిస్తే.. తొలి ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు చేసింది. అప్పట్లో చంద్రబాబు కు తెలిసేజరిగిందో.. తెలియకుండానే జరిగిందో.ఏదేమైనా.. వైసీపీ అధినేత..అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం.. ప్రారంభించారు. కొందరు టీడీపీ యువ ఎమ్మెల్యేలు.. జగన్‌ను టార్గెట్ చేశారు. ఆయనను జైలు పక్షి అని..చిప్పకూడు రుచిగా ఉందా? అని.. ఖైదీ నెంబరును చూపించి.. ఇది కలిసి వచ్చిన నెంబరు అధ్యక్షా! అంటూ.. సూటి పోటి విమర్శలు చేశారు. అదేసమయంలో.. ఆయనను ఆర్థిక నేరస్తుడు అంటూ.. విమర్శలు గుప్పించారు. అయితే.. వీటిని చంద్రబాబు ఖండించలేక పోయారు. కానీ, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్ని అన్నప్పటికీ..జగన్‌ను మాత్రమే తిట్టారు తప్ప.. కుటుంబ సభ్యుల జోలికిపోలేదు.
కానీ.. నాటి అవమానాలు కావొచ్చు.. తనను వ్యక్తిగతంగా దూషించిన అంశాలు కావొచ్చు.. జగన్ ఇంకా మరిచిపోలేదనే సంకేతాలు తాజాగా పరిణామాలను బట్టి తెలుస్తున్నాయి. ఒకప్పుడు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. టీడీపీ ఎమ్మెల్యేలను ఏమాత్రం నిలువరించే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు కనుక.. ఇప్పుడు తాము మరో రెండాకులు ఎక్కువ చేస్తే..తప్పేంటనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నట్టు గా పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే దూకుడుగా పేరున్న.. వ్యక్తిగత రాజకీయ కక్షలతో(గత ప్రభుత్వంలో తమ వ్యాపారాలు దెబ్బతీయాలని ప్రయత్నించారనే) ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటివారు.. ఇప్పుడు రెచ్చిపోతున్నారు. మరి .. ఇలాంటి సంప్రదాయ విరుద్ధమైన ఘటనలు అవసరమా? వీటికి ఎవరు చెక్ పెడతారు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎక్కడో ఒకచోట దీనికి.. ఫుల్ స్టాప్ పడకపోతే.. మున్ముందు.. మరింత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని ప్రజాస్వామ్య వాదులు హెచ్చరిస్తున్నారు.