Begin typing your search above and press return to search.
వివేకా హత్య కేసు : శివశంకర్ రెడ్డికి నో బెయిల్
By: Tupaki Desk | 26 Sep 2022 2:38 PM GMTఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి, ప్రస్తుత సీఎం జగన్ కి బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దాంతో ఆయనకు గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఈ కేసుని విచారించిన సుప్రీం కోర్టు హై కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లుగా పేర్కొంది. పైగా ఈ కేస్దులో కీలకమైన నిందితుడు గా శివశంకర్ రెడ్డిని భావిస్తున్నట్లుగా సుప్రీం కోర్టు అభిప్రాయపడడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ కేసులో శివశంకర్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా శివశంకర్ రెడ్డిని నిందితుడుగా ఎలా చెబుతారని ఆయన అంటున్నారు. తన క్లెయింట్ బెయిల్ మీద బయటకు వస్తే ఇతరులను ఎలా ప్రభావితం చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. అప్రూవర్‌గా మారిన వాచ్‌మెన్ ఇచ్చిన స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు.
మరో వైపు ఇదే కేసులో ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, అదే శివశంకర్ రెడ్డి జైలులో పదకొండు నెలలుగా ఉన్నా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా బెయిల్ ఇవ్వడం లేదని అభిషేక్ మనుసింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ వాదనలు అన్నీ విన్న సుప్రీం కోర్టు మాత్రం పూర్తిగా హై కోర్టు తీర్పునే సమర్ధించింది. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శివశంకర్ రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లు అయింది అంటున్నారు.
సుప్రీం కోర్టులో తాజాగా జరిగిన ఈ పరిణామాలు చూస్తూంటే మాజీ మాంత్రి వివేకా దారుణ హత్య విషయంలో కధ కీలకమైన మలుపు తిరుగుతున్నట్లే అనిపిస్తోంది అంటున్నారు. శివశంకర్ రెడ్డి కీలక నిందితుడు అంటున్న నేపధ్యం నుంచి చూసినపుడు ఈ కేసు దర్యాప్తు ఇక మీదట ఎలా సాగుతుంది అన్న ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.