Begin typing your search above and press return to search.
మోదీకి దక్షిణాది దమ్ముచూపండి:శివాజీ
By: Tupaki Desk | 4 May 2018 10:40 AM GMTత్వరలో కర్ణాటకలో జరగబోతోన్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ ,బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఏకంగా 8 రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం నిర్వహించేందుకు కేటాయించారు. నిన్న జరిగిన బళ్లారి పర్యటనలో మోదీ....కాంగ్రెస్ పై విరుచుకుపడి....బీజేపీ గెలుపు ఖాయమని నొక్కి వక్కాణించారు. మోదీ తాజా వ్యాఖ్యలపై ప్రత్యేక హోదా సాధన సమితి నేత, ప్రముఖ హీరో శివాజీ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయొద్దని....ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం బాగుపడేందుకు బీజేపీ ఓటమి అనివార్యమని, మోదీ సర్కార్ కు దక్షిణభారతీయుల సత్తా చూపాలని....ఓటుతోనే బీజేపీకి బుద్ధి చెప్పాలని శివాజీ అన్నారు.
ఈ సందర్భంగా మోదీపై శివాజీ మండిపడ్డారు. దక్షిణ భారత దేశానికి మోదీ గొప్ప పదవులు ఇవ్వలేదన్నారు. 2014లోని మోదీ 2018లో మోదీ ఒకరు కాదని అన్నారు. బళ్లారిలో 8 మంది అవినీతిపరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని, దేశంలో నీతికి తావు లేదని చెప్పారు. దక్షిణ, ఉత్తర భారతదేశాలను మోదీ విడగొడుతున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ దేశంలో నీతి - న్యాయం - చట్టం చచ్చిపోయాయని, ఓటుకు విలువ లేదని శివాజీ అన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ప్రజలు, అక్కడున్న తెలుగు ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని, లేదంటే దక్షిణ భారతదేశం బాగుపడదని శివాజీ అన్నారు. కర్ణాటకలోని తెలుగువారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని శివాజీ పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించి దక్షిణభారతీయుల సత్తా చూపించాలన్నారు. నేడు ఏపీకి అన్యాయం జరిగిందని,...రేపు తెలంగాణ - కర్ణాటక - కేరళ - తమిళనాడు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.