Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌లో చిన్న ముక్క గ‌రుడ‌!

By:  Tupaki Desk   |   22 March 2018 11:25 AM GMT
ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌లో చిన్న ముక్క గ‌రుడ‌!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌ళం విప్పిన మొద‌టి వ్య‌క్తుల్లో సినీ న‌టుడు శివాజీ ఒక‌రు. అయితే.. అత‌డెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాలేదు. ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న అంతంతే. త‌న ప్ర‌య‌త్నాలు తాను చేసి.. చివ‌ర‌కు మ‌ధ్య‌లో విదేశాల‌కు వెళ్లిపోయిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌నే తిరిగి వ‌చ్చారు.

వ‌చ్చిన నాటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేయ‌టం మొద‌లు పెట్టారు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ వినిపించ‌ని కొత్త కోణంలో ఒక సంచ‌ల‌న విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టారు శివాజీ. ఆయ‌న చెప్పే మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది పక్క‌న పెడితే.. 2019 ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని.. ఒక‌జాతీయ‌పార్టీ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఈ ఆప‌రేష‌న్ కు సంబంధించి 2017 సెప్టెంబ‌రులోనే త‌న‌కు స‌మాచారం అందింద‌న్నారు. ఇంత‌కీ ఆప‌రేష‌న్ షురూ చేసిన జాతీయ పార్టీ పేరు చెప్ప‌ని ఆయ‌న‌.. మిష‌న్ పేరు మాత్రం ఆప‌రేష‌న్ ద్ర‌విడ అని చెప్పారు. కొంద‌రు ఆప‌రేష‌న్ గ‌రుడ అని చెబుతున్నార‌ని కాకుంటే అది ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌లో చిన్న ముక్కేన‌న్నారు. ఆప‌రేష‌న్ ద్ర‌విడ అంటే ద‌క్షిణ భార‌తదేశ‌మ‌ని.. ద‌క్షిణాదిన ఉన్న కీల‌క రాష్ట్రాల్లో పాగా వేయ‌ట‌మే ఈ మిష‌న్ ల‌క్ష్యంగా పేర్కొన్నారు.

ఆంధ్రా.. తెలంగాణ‌ల‌కు క‌లిపి ఆప‌రేష‌న్ గ‌రుడ పేరును ఫిక్స్ చేశార‌న్నారు. అందులో ఉప భాగాలుగా క‌ర్ణాట‌క‌కు ఆప‌రేష‌న్ కుమార అని.. త‌మిళ‌నాడుకు ఆప‌రేష‌న్ రావ‌ణ అని పేరు పెట్టుకున్న‌ట్లు చెప్పారు. త‌న‌కు తెలిసిన ఈ ఆప‌రేష‌న్ వివ‌రాలు తాను మీడియాకు ఇస్తాన‌ని చెప్పారు. తాను చెప్పిన ఆప‌రేష‌న్లు అన్ని ఒక జాతీయ పార్టీ పెట్టుకున్న పేర్లుగా వెల్ల‌డించారు.

2019 ఎన్నిక‌ల్ని టార్గెట్ చేసేలా ఈ మిష‌న్ ప‌ని చేస్తుంద‌ని.. ఈ ఆప‌రేష‌న్ కోసం రూ.4800 కోట్ల మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని.. ఇందుకు సంబంధించిన కొంత మొత్తం ఇప్ప‌టికే త‌ర‌లించారన్నారు. ఆప‌రేష‌న్ పేర్లు మార‌వ‌చ్చ‌ని.. ఇందులోకి వెళ్ల‌ట‌మేకానీ బ‌య‌ట‌కు వ‌చ్చేది లేద‌న్నారు. ఈ ఆప‌రేష‌న్ కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఒక రాజ్యాంగ శ‌క్తి ఉన్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఐదుసార్లుగా వాయిదా ప‌డిన మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం రేపు స‌భ‌లో చ‌ర్చ‌కు రావొచ్చ‌న్నారు. త‌న‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఇందుకు సంబంధించి మోడీ స‌ర్కారు వ్యూహం సిద్ధం చేసింద‌న్నారు. రేపు పార్ల‌మెంటులో మాట్లాడేందుకు మొత్తం ఆరుగురిని నియ‌మించింద‌ని.. అందులో ముగ్గురు ఇంగ్లిషులో మాట్లాడితే.. మ‌రో ముగ్గురు హిందీలో మాట్లాడ‌తార‌న్నారు.

అధికార‌ప‌క్షం బుల్డోజ్ చేసినా.. ఏపీ ఎంపీలు నిజాలు మాట్లాడాల‌న్నారు. ఏపీ ఎంపీల అనైక్య‌తే రాష్ట్రానికి శాపంగా మారింద‌న్న ఆయ‌న‌.. తాను ఏ పార్టీలో చేరేది లేద‌న్నారు. త‌న‌కు ప్ర‌జ‌ల హ‌క్కులే ముఖ్యంగా శివాజీ తేల్చి చెప్పారు. శివాజీ చెప్పిన ఆప‌రేష‌న్ ద్ర‌విడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. అదో సంచ‌ల‌నంగా మారింది.