Begin typing your search above and press return to search.
ఆ కుర్రాడి శీలం పోయిందట
By: Tupaki Desk | 17 Nov 2015 8:48 AM GMTదేశంలో ఎక్కడ విన్నా మోసపోతున్న యువతుల కథలే వినిపిస్తున్నాయి... నమ్మించి మోసం చేసే ప్రియులు.. బలవంతంగా పాడుచేసే దుండగులు.. బెదిరించి లైంగికంగా దోచుకునే క్రూరులు.. ఉద్యోగాలో, ఇంకొకటో ఇంకొకటో ఆశ చూపి ఆడుకునే మాయగాళ్లు... ఇలా లోకంలో ఏదో రకంగా మోసపోతున్న మహిళలు కనిపిస్తున్నారు. అలాంటి తరుణంలో విచిత్రంగా ఓ యువకుడు తాను ఒక అమ్మాయి చేతిలో మోసపోయానని... ప్రేమ ముసుగులో తన శీలం దోచుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు... ఆ అమ్మాయిపై రేప్ కేసు పెట్టమని పట్టుబడుతున్నాడు.
తన ప్రియురాలు తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా శారీరక సంబంధం కొనసాగించి గర్భం దాల్చిందని... అంతా అయ్యాక ఇప్పుడు తనను కాదంటోందని... శీలం కోల్పోయిన తాను ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలను అంటూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో నమోదైన ఈ కేసు పోలీసులనే ఆశ్చర్యపరుస్తోంది. నిజంగానే నిజాయితీ పరుడా లేకుండా ఏదైనా గేమ్ ప్లే చేస్తున్నాడా అన్న అనుమానంతోనే వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలలుగా ఆ యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో ఆయన తన ప్రియురాలు తనను దూరం చేస్తోందని... తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆయన తన కథంతా చెప్పొకొచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తనకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయే తనను ప్రేమ ముసుగులో దించిందని... ఆ తరువాత తాను వద్దంటున్నా కూడా.. తప్పని చెప్పినా వినకుండా తనతో శారీరక సంబంధం కొనసాగించిందని శివకుమార్ చెబుతున్నాడు. అంతేకాదు... తనతో బలవంతంగా సెక్సు చేసి గర్భం దాల్చిందని అంటున్నాడు. అయితే.. ఆమె తల్లిదండ్రులు తనను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారని శివకుమార్ పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత కూడా ఆ అమ్మాయి తనతో సెక్స్ లో పాల్గొందని చెప్పిన శివకుమార్ ఇప్పటివరకు ఆమె కోసం రూ.5 లక్షకు ఖర్చు చేశానని చెబుతున్నాడు.
ఇప్పుడు కొద్దికాలంగా ఆ అమ్మాయి శివకుమార్ ను పట్టించుకోకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తల్లిందండ్రులు యువతిని హసన్ లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించిన ప్రయోజనం లేదని ఫిర్యాదు చేశాడు. డబ్బు పోయినందుకు తనకు బాధేమీ లేదని... కానీ, తన శీలం పోయిందని... మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలని శివకుమార్ తెగ బాధపడుతున్నాడు. ఆ అమ్మాయిపై రేప్ కేసు పెట్టాలని పోలీసులను కోరుతున్నాడు. అయితే పోలీసులు మాత్రం అమ్మాయిపై రేప్ కేసు పెట్టలేమని చెప్పేశారు. మోసగించినట్లుగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. పోలీసులు రేప్ కేసు పెట్టకపోవడంతో శివకుమార్ మీడియా ముందుకొచ్చారు. ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు నా శీలాన్ని ఆమె దోచుకుంది. నాకు న్యాయం చేయండి. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని.. ఆమెతో తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.