Begin typing your search above and press return to search.
వైసీపీలోకి టీడీపీ ఎంపీ?
By: Tupaki Desk | 4 Feb 2017 4:31 PM GMTపార్లమెంటులో ఏ విషయంపైనైనా తన నిరసన తెలిపేందుకు విచిత్ర వేషాలు వేసే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధిష్ఠానం మెతక వైఖరి కారణంగా ప్రత్యేక హోదా విషయంలో కనీసం నిరసన కూడా తెలపలేకపోతున్నామన్న అసంతృప్తి ఆయనలో తీవ్రంగా ఉంది. పలుమార్లు ఇది బయటపడింది కూడా. అయితే.. తొలి నుంచి టీడీపీలో నమ్మకంగా ఉన్న ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు రాలేదు. కానీ.. చిత్తూరు జిల్లాలో కొన్నాళ్లుగా ఇతర టీడీపీ నేతల నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నారు. తాజాగా ఎంపీ కుమార్తె డ్రైవరుపై ఏపీ మంత్రి - మరో టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు దాడి చేశాడని.. ఎంపీ కుమార్తెను కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలు.. దానిపై ఎంపీ కుమార్తె ధర్నా చేయడం.. దానికి వైసీసీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్దతు పలకడం వంటి ఘటనల నేపథ్యంలో శివప్రసాద్ టీడీపీని వీడుతారన్న సంకేతాలు కనిపిస్తన్నాయి. ఎంపీ అనుచరులు కూడా ఆయనపై ఈ దిశగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో అవమానాలు పడేకంటే బయటకు వచ్చేయడం బెటరన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవీలత నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. తనను తోసేయడంతో పాటు, తన డ్రైవర్ అంజనేయులుపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఆందోళనకు దిగారు. అయితే దాడి చేసిన వ్యక్తి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు సైలెంటయిపోయారు. ఆందోళన చేస్తున్న మాధవీలతకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ మాధవీలత కల్యాణ్ జ్యూయలరీ రోడ్డులోంచి కారులో వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో డోర్లు తెరిచి నిలబెట్టిన కారును పక్కకు తీయాల్సిందిగా మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు హారన్ కొట్టారు. పక్కనే ఉన్న ఇంట్లోంచి బయటకు వచ్చిన నరేంద్ర అనే వ్యక్తి హారన్ కొడితే నరికేస్తానంటూ సైగ చేశాడు. దీంతో మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు కారు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగాడు. వీరు వాదులాడుకుంటుండగానే పక్కనే ఉన్న నరేంద్ర డ్రైవర్ దీపు వచ్చి ఆంజనేయులుపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఎంపీ కూతురు మాధవిలతతోనూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె అక్కడే బైఠాయించారు. తనకు క్షమాపణ చెప్పాలంటూ దాడి చేసిన వ్యక్తి ఇంటి ముందే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నరేంద్రను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఆ సమయంలో మాధవీలత వేసిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయమయ్యాయి. టీడీపీ ఎంపీ కుమార్తె అయిన ఆమె.. ‘‘చంద్రబాబు ప్రభుత్వంలో ఇదేనా మహిళలకు రక్షణ’’ అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ‘‘ఒక దళిత మహిళ నాలుగు గంటల పాటు రోడ్డుపై ఆందోళన చేస్తుంటే ఎవరూ పట్టించుకోరా అని మండిపడ్డారు. ఇలాంటి పాలన అందిస్తున్న చంద్రబాబుకు ఒక దండం’’ అంటూ మీడియా ముందు మాధవిలత వ్యాఖ్యానించారు. చివరకు నిందితుడితో తనకు క్షమాపణ చెప్పించేపరిస్థితి కనిపించకపోవడంతో మాధవీలత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కుమార్తెకు జరిగిన అవమానంపై శివప్రసాద్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెబుతున్నారు. ఎప్పటినుంచో తనలో ఉన్న అసంతృప్తిని ఇది మరింత రాజేసిందని ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారాని అనుచరులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/