Begin typing your search above and press return to search.
భువనేశ్వరి అక్క పాదాలను కన్నీటితో...?
By: Tupaki Desk | 4 Dec 2021 2:00 PM GMTఇది నిజమేనా. అంటే నిజమే మరి. అన్నది ఆయనైతే విన్నది అందరి చెవులూనూ. ఇలా చెప్పింది ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్యే. పైగా జగన్ కి వీరవిధేయుడు. జగన్ సొంత జిల్లాకు చెందిన వారు. ఆయనే పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి. ఆయన లేటెస్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అంటే తనకు అక్కతో సమానమని చెప్పారు. ఆమెను ఎవరైనా ఏమైనా అంటే అంతకంటే దారుణం అవమానం వేరోకటి లేనే లేదని కూడా పేర్కొన్నారు.
వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఎలాగో భువనేశ్వరి కూడా తమకు అలాగే అంటూ శివప్రసాదరెడ్డి చెప్పడం విశేషం. అటువంటి ఆమె వ్యక్తిత్వం మీద నిందలు వేయడం కంటే దుర్మార్గం వేరేది ఉండబోదని కూడా అచ్చం టీడీపీ సౌండ్ తోనే చెప్పడం విశేషం. మహిళలను కించపరచడం మహా తప్పు అని అది ఎవరు చేసినా తప్పుగానే చూస్తామంటున్నారు.
అంటే వైసీపీ నేతలనే ఇండైరెక్టర్ గా శివప్రసాదరెడ్డి హెచ్చరించారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూసుకుంటే భువనేశ్వరి అక్కకు తాము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన మరో అడుగు ముందుకేసి భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే తన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ రోజుకీ ఆమె బాధపడుతూ ఉంటే అన్న కండిషన్ కూడా పెట్టారనుకోండి.
అంతే కాదు ఇంకాస్తా అడుగు ముందుకేసి భువనేశ్వరి అక్క కాళ్ళు తమ కన్నీటితో కడుగుతామని కూడా శివప్రసాదరెడ్డి చెప్పారు. తానొక్కడినే కాదు, మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మొత్తానికి చూస్తూంటే అసెంబ్లీలో చంద్రబాబు మీద వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆఫ్ ది రికార్డుగా చేసిన రన్నింగ్ కామెంటరీ పట్ల ఆ పార్టీలోనే చాలా మంది గుర్రుగా ఉన్నారని అర్ధమవుతోంది. అంతే కాదు, చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ తో కంప్లీట్ గా డిఫెన్స్ లో పడిన వైసీపీ ఈ రోజుకీ దాని నుంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతోంది అన్నది కూడా రాచమల్లు మాటలతో తేలుతున్న సత్యం. ఏది ఏమైనా ఈ రచ్చతో జగన్ కి సొంత జిల్లా నుంచే షాకింగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయని అర్ధం చేసుకోవాలేమో.