Begin typing your search above and press return to search.
టీవీ9తో పాటు ఆరు లోగోలు రూ.99వేలు మాత్రమేనా రవిప్రకాశ్?
By: Tupaki Desk | 17 May 2019 6:06 AM GMTనీతులు చెప్పే మాటలకు.. చేతలకు మధ్య అంతరం ఎంతన్న విషయాన్ని సరికొత్తగా చెప్పేశారు మెరుగైన సమాజం కోసం అదే పనిగా శ్రమించే రవిప్రకాశ్. టీవీ స్క్రీన్ మీదకు వచ్చింది మొదలు గొప్పలు చెప్పుకోవటం.. పాత్రికేయ రంగానికి చేసిన తన సేవ గురించి ఆయన అదే పనిగా చెప్పటమే కాదు.. మోడీ 56 అంగుళాల ఛాతీ మాదిరి.. రవిప్రకాశ్ నీతి ఎలా ఉంటుందో ఇంతకాలం చూపించిన దానికి మించిన సిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
టీవీ9 చానల్ కుచెందిన సంస్థ ఒకటి ఉందిగా. దానికి సంబంధించిన ఆరు లోగోలు.. అందులో టీవీ9 లోగో కూడా ఉంది. ఆ లోగోల్ని రవిప్రకాశ్ సొంత సంస్థ మోజోటీవీకి చెందిన కంపెనీకి కేవలం రూ.99వేలకు అమ్మేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. టీవీ9 కొత్త యాజమాన్యానికి (90 శాతానికి మించి షేరున్న అలందా మీడియా) షాకిస్తూ లోగోల అమ్మకానికి సంబంధించిన విషయాన్ని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రావు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం.. రవిప్రకాశ్.. మూర్తి.. హరికిరణ్ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేవలం రూ.99వేలకు అమ్మేసిన వైనాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
2018 మే 22న కుదిరిన మౌఖిక ఒప్పందం మేరకు వీటిని అమ్ముతున్నట్లుగా 2018 డిసెంబరు 31న డీడ్ (ఒప్పందం) ద్వారా వాటిని రాసిచ్చేయటం గమనార్హం. లోగోలు అమ్మినందుకు టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్ కు డబ్బులు ముట్టాల్సి ఉంటుంది. అందుకు సాక్ష్యంగా 2019 జనవరి 22న రూ.99వేల నెక్ట్స్ ఇండియా (మోజో టీవీ కంపెనీ) నుంచి టీవీ9 సంస్థ అయిన ఏబీసీపీఎల్ కు బదిలీ చేశారు. ఒక ప్రముఖ చానల్ లోగోను అమ్మేసే సమయంలో.. మెజార్టీ వాటాదారుల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా.. వారికి కనీస సమాచారం ఇవ్వాలన్న నిబంధనను పాటించని వైనాన్ని తాజా ఫిర్యాదులో ప్రస్తావించారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రూ.99వేలకు టీవీ9తో పాటు మరో ఐదు లోగోల్ని రవిప్రకాశ్ సొంత సంస్థకు అమ్ముకున్న ఫిర్యాదు మాట ఇప్పుడు వైరల్ గా మారి.. కొత్త సంచలనానికి తెర తీసిందని చెప్పక తప్పదు.