Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు ఆరు నెలల క్వారంటైన్ సరిపోతుందా?
By: Tupaki Desk | 28 Aug 2020 4:00 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తెచ్చేందుకు వందకు పైగా సంస్థలు కిందామీదా పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ.. మందును కనుగొనేందుకు భారీగా శ్రమిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో మాయదారి వైరస్ కు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడులానే ఉంది. మొన్నటివరకు వారసత్వ రాజకీయాలకు జై కొట్టే కాంగ్రెస్ సీనియర్లు.. ఉన్నట్లుండి యువరాజు చేతికి పగ్గాలు అప్పజెప్పేందుకు ససేమిరా అంటున్నారు. కరోనాకు ఏ మాత్రం తీసిపోని అసమ్మతి వైరస్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఎవరైతే అధికారాన్ని ఎంజాయ్ చేశారో.. ఎవరైతే కీలక పదవుల్లో ఉన్నారో.. వారే తన కొడుక్కి పగ్గాలు ఇచ్చేందుకు అడ్డుతగలటం గాంధీ కుటుంబాన్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంతకీ సీనియర్లు ఎందుకింతకు తెగించారన్నది ప్రశ్న. దీనికి సమాధానం.. వారి ఉనికికే ముప్పు రావటం. మోడీ మాదిరి రాహుల్ కు లౌక్యం తెలీదనే చెప్పాలి. తనకు గురువైన అద్వానీకి హ్యాండిచ్చిన వైనం కావొచ్చు.. కీలక పదవుల్లో ఆయన లేకుండా చూడటమే కాదు.. ఆయనకు అత్యంత సన్నిహితులైన వారిని ఒక పద్దతి ప్రకారం సైడ్ ట్రాక్ కు పట్టించటంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు సైతం సాధ్యం కాలేదని చెప్పాలి.
కొత్త అధినేతను ఎన్నుకోవటానికి ముహుర్తం పెట్టి సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. దానికి రెండు రోజుల ముందుగా లేఖను విడుదల చేయటం ద్వారా అధినేత్రికి.. వారి అబ్బాయికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. గతానికి భిన్నంగా తన చేతికి పార్టీ పగ్గాలు వచ్చినంతనే సీనియర్ల సంగతి చూడాలన్న పట్టుదలతో ఉన్న యువరాజుకు కోపం వచ్చింది. ఈ కారణంతోనే ఎప్పుడూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే రాహుల్..ఈసారి సీనియర్లపై విరుచుకుపడ్డారు.
ఇలాంటి పరిస్థితిని ఊహించటం వల్లనేమో.. ఏ మాత్రం త్రోటుపాటుకు గురి కాకుండా గాంధీ కుటుంబ సభ్యుడికి చురకలు అంటిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు వదిలారు. వ్యవహారం బయటకు రావటం.. దీన్ని ఏ మాత్రం ఊహించలేని కాంగ్రెస్ అధినేత్రి తేరుకోవటానికి కాస్త సమయం పట్టిందని చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా వీసే గాలిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన సోనియమ్మ.. చక్రం తిప్పి.. ఆర్నెల్ల పాటు తానే అధ్యక్షురాలిగా ఉండేలా పార్టీ నిర్ణయం తీసుకునేలా చేసుకోగలిగారు.
ఆ తర్వాతే కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఆర్నెల్ల క్వారంటైన్ కాలంలో పార్టీకి పట్టిన అసమ్మతి కరోనా అంతు చూడాలన్న ఆలోచనలో సోనియమ్మ ఉన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. లోక్ సభ.. రాజ్యసభల్లో కీలక పదవుల్లోని సీనియర్లను మార్చి.. తమ కుటుంబానికి వీర విధేయులైన వారిని నియమించటంతోపాటు.. తమ జట్టులోకి వచ్చిన చేరిన కొత్త పార్టీలకు చెందిన మీడియాలో సీనియర్లకు షాకిచ్చేలా వ్యాఖ్యానాలు వచ్చేలా చేశారు. తాను పెదవి విప్పకుండానే జరగాల్సిన పనులన్ని జరిగేలా చేస్తున్న సోనియమ్మ తీరు చూస్తుంటే.. ఆర్నెల్ల వ్యవధిలో మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పాలి. మరి.. ఈ కాలంలో సీనియర్లు ఏం చేస్తారో చూడాలి.