Begin typing your search above and press return to search.
బీజేపీలోకి ఈ ఆరుగురు టీడీపీ నేతలకు ఎంట్రీ లేదట!
By: Tupaki Desk | 13 July 2019 10:20 PM GMTఇటీవలే ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టీడీపీ నుంచి క్రమంలో నేతలు చేజారుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, ఓ ఎమ్మెల్సీ బీజేపీలోకి చేరిపోగా... మరింత మంది టీడీపీ నేతలు బీజేపీలోకి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే టీడీపీ నుంచి ఎంతమంది వచ్చినా ఫరవా లేదని చెబుతున్న కమలనాథులు ఓ ఆరుగురు టీడీపీ నేతలు తమంతట తాముగా వచ్చినా కూడా చేర్చుకునేందుకు సిద్ధంగా లేరట. అదేంటీ... ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏ స్థాయి నేత వచ్చినా రెడ్ కార్పెట్ పరుస్తున్న బీజేపీ... టీడీపీకి చెందిన ఓ ఆరుగురిపై ఇలా నిషేధం వేటేసిందేమిటా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
అయినా బీజేపీ వద్దంటున్న టీడీపీ నేతలు ఎవరన్న విషయానికి వస్తే... తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ - మాజీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి - రాయపాటి సాంబశివరావు - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లను తమ పార్టీలో చేర్చుకునేది లేదని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారట. అయినా ఈ ఆరుగురిలో ఓ ఐదుగురు నేతలు ఓడిపోయి ఉండవచ్చు గానీ... టీడీపీ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతలే కదా. అంతేకాకుండా తమ తమ నియోజకవర్గాలతో పాటు తమ జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం చూపగలిగిన నేతలే.
ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నియోజకవర్గ ప్రజల కోసం ఏకంగా తానుంటున్న పార్టీ ప్రభుత్వంపైనే ఆందోళనకు దిగిన నేతగా వంశీకి మంచి పేరే ఉంది. అంతేనా చాలా కాలం నుంచే రాజకీయాల్లో ఉన్నా... అవినీతి మరక అంటని నేతగా కూడా వంశీకి మంరి పేరుంది. ఈ కారణంగానే వైసీపీ వైపు గాలి బలంగా వీచినా కూడా వంశీ టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఇక మిగిలిన ఐదుగురు నేతలు సత్తా కలిగిన వారే అయినా... వారి వ్యవహారాలు మాత్రం తీవ్ర వివాదం రేకెత్తించాయి. ఈ కారణంగానే ఇలాంటి ఆరోపణలు ఉన్న నేతలు... టీడీపీని వీడి తమ పార్టీలోకి చేరతామన్నా కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేదని కమలనాథులు తెగేసి చెబుతున్నారట. అంటే... టీడీపీ మొత్తం ఖాళీ అయినా కూడా ఈ ఆరుగురు మాత్రం టీడీపీలోనే కొనసాగక తప్పదేమో.