Begin typing your search above and press return to search.
కేసీఆర్ ముందస్తులో ఇంకో ముందడుగు
By: Tupaki Desk | 4 Sep 2018 1:11 PM GMTషెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలలు సమయం ఉన్నప్పటికీ....తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ వచ్చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ - అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో మొదలైన ఈ కలకలం...అనూహ్య రీతిలో హీట్ పెరిగి ముందస్తుకు వెళ్లే వరకు చేరింది. పెద్ద ఎత్తున వరాలు కురపించడం, కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యానికి తోడు...ప్రగతి నివేదన సభ పేరుతో కీలక సమావేశం నిర్వహించడంతో ముందస్తుకు కేసీఆర్ ముహుర్తం రెడీ చేసుకున్నారనే ప్రచారం తారాస్థాయికి చేరింది. ఈ ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ భేటీ అయ్యారు.
సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీలపై చర్చించారు. ముందస్తు ఎన్నికల సన్నాహాలపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు సెక్రటేరియట్ వర్గాల సమాచారం. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో.. సీఎస్ ఎస్కే జోషి - అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి - సీఎంఓ కార్యదర్శి నర్సింగరావు సమావేశం అయిన అనంతరం అధికారులు రాజ్ భవన్ వెళ్లినట్టు సమాచారం. గవర్నర్ తో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. ఈ కీలక చర్చలు ముందస్తు కోసమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ సమావేశం అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే.. అప్పుడు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.