Begin typing your search above and press return to search.
ఠారెత్తిస్తున్న పుర్రె మాఫియా?
By: Tupaki Desk | 28 Sep 2015 3:17 PM GMTజిహ్వాకో రుచి.. పుర్రెకో బుద్ధి అని ఊరికే అనలేదేమో. ఎదుటోడ్ని ఇబ్బంది పెట్టేందుకు నేరపూరితంగా వ్యవహరిస్తే.. కోపం ఉన్న వారి మీద పగ తీర్చునేందుకు చేస్తున్న దందా వణుకు పుట్టేలా చేస్తుంది. చట్టంలో ఉన్న అవకాశాల్ని తమ స్వార్థం కోసం ఏలా ఉపయోగిస్తున్న విషయం తాజా ఉదంతం తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎదుటి మనిషి ఇబ్బంది పెట్టాలన్న ధోరణితో.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న ఈ దందా గురించి కూపీ లాగి.. వివరాలు బయటపెట్టటంలో పుర్రె దందా ఒకటి బయటకు వచ్చింది.
ఈ వ్యవహారం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకోవటమే కాదు.. ఇలా కూడా చేయొచ్చా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. హర్యానాలో వెలుగు చూసిన ఈ దందాలో నేతలు.. పోలీసులు.. డాక్టర్లు అందరూ కుమ్మక్కు కావటం విశేషం. ఇంతకీ ఈ పుర్రె మాఫియా ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం.
ఎవరికైనా.. ఎవరి మీదనైనా పట్టలేనంత కోపం.. ఆగ్రహం ఉందనుకోండి. ఏదో విధంగా వారిని ఇబ్బంది పెట్టి.. జైలుకు పంపాలని అనుకున్నంత కసి ఉందనుకోండి.. ఇక.. ఆపరేషన్ పుర్రె మొదలువుతుంది.
తన ప్రత్యర్థి తన మీద దాడి చేసి తీవ్రంగా గాయపడినట్లుగా కేసు నమోదు అవుతుంది. గాయం తీవ్రత కోసం వెంటనే అతడ్ని ప్రభుత్వాసుపత్రికి పంపుతారు. ఒంటి మీద దెబ్బ పడకుండానే ఇదంతా జరుగుతుందని మర్చిపోకూడదు. అయితే.. ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిన సదరు వ్యక్తి అక్కడకు కాకుండా ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం తరలిస్తారు. ఇలా ఆసుపత్రికి వెళ్లిన వెంటనే.. పుర్రెకు చిన్న ఆపరేషన్ చేసి.. చిన్న ముక్క తీస్తారు. ఇది ప్రమాదంతో పాటు.. ఖర్చుతో కూడుకున్నది. అయినా.. దాన్నేమీ పట్టించుకోరు. ఈ సర్జరీకి రూ.లక్షన్నర నుంచి రూ.9 లక్షలు ఖర్చు చేస్తారు. అనంతరం ఇంత గాయం చేసిన వ్యక్తిని పట్టుకొని కోర్టు ముందు పెడితే.. మెడికల్ రిపోర్టులు చూసిన న్యాయమూర్తి ఏకంగా పదేళ్లు జైలుశిక్ష వేసే పరిస్థితి. అంతే రక్తం బొట్టు కారకుండానే.. తనకు కోపం ఉన్న వారిని పదేళ్లు జైలుకు పంపిచొచ్చు అన్న మాట.
ఈ దారుణమైన దందా హర్యానాలో ఎక్కువ కావైంది. ఓ 83 ఏళ్ల ముసలామె.. ఆరడుగులున్న ఒక వ్యక్తి మీద దాడి చేశారంటూ.. ఇదే పుర్రె కథ చెప్పారు. ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసు విషయంపై లోతుగా దృష్టి సారించిన పోలీసు అధికారులకు చాలానే సందేహాలు కలిగాయి. ఒక్కసారి తీగ లాగితే మొత్తం డొంక బయటకు వచ్చి.. పుర్రె కుంభకోణం బయటకు వచ్చింది. ఆయుధం అన్నది లేకుండా ప్రత్యర్థి మీద పగ తీర్చుకుంటున్న ఈ దర్మార్గపు క్రీడ ఇప్పుడు హర్యానాలో సంచలనం సృష్టిస్తోంది.