Begin typing your search above and press return to search.
హిల్లరీ యాక్టివ్ కాదని చురకలేసిన ట్రంప్
By: Tupaki Desk | 21 Sep 2016 11:35 AM GMT అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే నోటికొచ్చినట్లు మాట్లాడే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం అవకాశం దొరికినా మరింత రెచ్చిపోతారు. తాజాగా ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి డెమొక్రాట్ల కేండిడేట్ హిల్లరీ క్లింటన్ ను ఎద్దేవా చేశారు. హిల్లరీ ఓ ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన తన నోటికి పనిచెప్పారు. ''ఆమెకు విశ్రాంతి అవసరం... బాగా విశ్రాంతి తీసుకోనివ్వండి" అంటూ ట్వీట్లు చేశారు.
కాగా హిల్లరీ ఇంతకుముందు న్యూమోనియాతో బాధపడుతూ కొన్ని రోజులు ప్రచారంలో పాల్గొనలేకపోయారు. తాజాగా మరోసారి ఆమె ప్రచారానికి దూరంగా ఉంటుండడంతో ఆమె యాక్టివ్ లీడర్ కాదన్న కోణంలో ట్రంప్ ట్వీట్లు చేశారు. వచ్చే సోమవారం జరిగే మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ఆమె పాల్గొంటారు. అంతవరకు ఆమె ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మొన్నటి సోమవారం నుంచి ఆదివారం వరకు ఆరు రోజుల పాటు ప్రచారంలో లేకపోవడంతో ట్రంప్ నోటికి పనికి దొరికొంది.
దీంతో ఆయన.... ఆమె ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని తనకు అవకాశంగా మలచుకునేలా వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ లూసియానా.. మెక్సికో వెళ్లలేదని.. అలాంటి ఆమె అమెరికాను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. అమెరికాను బాగుచేసేందుకు కావాల్సిన చైతన్యం, శక్తి ఆమెకు లేవని ట్రంప్ ట్వీట్లు చేశారు.