Begin typing your search above and press return to search.

‘నిద్ర’ పోటీలో గెలిచి రూ.5లక్షలు సొంతం చేసుకున్న ఆమె!

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:53 AM GMT
‘నిద్ర’ పోటీలో గెలిచి రూ.5లక్షలు సొంతం చేసుకున్న ఆమె!
X
మనం పెద్దగా పట్టించుకోం కానీ మన చుట్టూనే బోలెడన్ని ఆసక్తికరమైన పోటీలు జరుగుతుంటాయి. మనకున్న అలవాట్లను బలంగా మార్చుకొని విజయం సాధించే అవకాశం ఉంటుంది. తాజా ఉదంతం ఆ కోవలోకి చెందినదే. ఒక ప్రైవేటు పరుపుల సంస్థ 'నిద్ర' పోటీని నిర్వహించింది. సదరు సంస్థ సవాలు ప్రకారం వంద రోజుల పాటు ఆరోగ్యకరమైన నిద్ర పోవాలి. ఇందుకోసం ఏకంగా తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది.

కొందరికి ఎక్కడ కూర్చున్నా.. చివరకు నిలుచున్నా కూడా తూలుతుంటారు. మరికొందరికి.. ఎంత ప్రయత్నించినా నిద్ర అనేది పట్టదు. ఇలాంటి వారు నిద్ర కోసం పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ఒక పరుపుల సంస్థ నిద్రను ఒక పోటీగా సిద్ధం చేసి.. అందులో గెలిచిన వారికి రూ.5లక్షల ప్రైజ్ మనీ పెట్టారు.

ఈ పరీక్షకు చాలామందే ముందుకు వచ్చినా.. పశ్చిమ బెంగాల్ కు చెందిన త్రిపర్ణ చక్రవర్తి అనే అమ్మాయి విజేతగా నిలిచింది. ఈ పోటీలో భాగంగా వరుసగా 9 గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. అలా వంద రోజులు చేయాల్సి ఉంటుంది.

ఈ నిద్ర పోటీలో పాల్గొన్న వారి కంటే మిన్నగా త్రిపర్ణకు ఏకంగా 95 శాతం మార్కుల్ని సాధించింది. 5.5 లక్షల మంది పోటీదారుల కంటే మిన్నగా నిలిచి పోటీలో విజయాన్ని సొంతం చేసుకుంది.

చిన్నతనం నుంచి ఈమెకు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయే అలవాటు ఉందట. కూర్చొని ఉన్నా కూడా నిద్రపోయే ఆమె అలవాటుకు పరాకాష్ఠ ఏమంటే.. ఒకసారి ఎగ్జామ్ హాల్లో గుర్రు పెట్టి నిద్రపోయింది. తనకు అదే పనిగా ముంచుకొచ్చే నిద్ర గురించి ఆమె బాధ పడి ఉండొచ్చు.

ఆ అలవాటే తనను ఈ రోజున విజేతగా నిలపటమే కాదు.. భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా సొంతం చేసుకునే అవకాశాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. ఈమె ఉదంతం గురించి విన్నాక.. 'ఏ అలవాటు చెడ్డది' కాదన్న భావన మదిలో మెదలక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.