Begin typing your search above and press return to search.
మహారాష్ట్రకు కాస్త ఊరట.. కర్నాటకకు షాక్!
By: Tupaki Desk | 14 May 2021 2:30 AM GMTకరోనా మహమ్మారి విషయంలో చాలా రోజుల తర్వాత మహారాష్ట్రకు కాస్త ఊరట లభించింది. కరోనా డేంజర్ బెల్స్ విపరీతంగా మోగిన మహారాష్ట్రను వైరస్ ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిదశ కేసుల నుంచి మహారాష్ట్రనే మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది. పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల పరంగా ఆ రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది
సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా అక్కడే ఉంది. రెండో దశ తొలుత ఆ రాష్ట్రంలోనే ఆరంభమైంది. కాగా తాజాగా అక్కడ పరిస్థితులు కుదుటపడ్డాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో అధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రంగా కర్నాటక ఉండగా, రెండోస్థానంలో మహారాష్ట్ర నిలిచింది.
ఎక్కువ కొవిడ్ కేసులు ఉన్న రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. ఆ రాష్ట్ర రాజధాని బెంగుళూరులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధించినా పెద్దగా ఫలితం లేదు. దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న నగరంగా బెంగుళూరు, ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా కర్నాటక నిలిచాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారికంగానే 5.90లక్షల క్రియాశీల కేసులు ఉన్నట్లు అక్కడి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో ఈ సంఖ్య 5.48 లక్షలుగా ఉంది. 4.33 లక్షల కేసులతో కేరళ మూడో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 12 వేల వరకు క్రియాశీల కేసుల సంఖ్య తగ్గింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే 40 శాతం పాజిటివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యలో కర్నాటక తొలి స్థానానికి రావడం కర్నాటక ప్రభుత్వం ఆందోళనలో ఉంది. కొవిడ్ కట్టడికి మెరుగైన చర్యలపై దృష్టి సారించింది.