Begin typing your search above and press return to search.

కేసీఆర్ చండీయాగాని స్వల్ప ఆటంకం

By:  Tupaki Desk   |   27 Dec 2015 6:29 AM GMT
కేసీఆర్ చండీయాగాని స్వల్ప ఆటంకం
X
నిరాటంకంగా సాగుతున్న అయుత చండీయాగం చివరి రోజున స్వల్ప అవాంతరం ఎదురైంది. 101 హోమ గుండాల్లో టన్నుల కొద్దీ ఆవు నెయ్యి - కర్పూరం - సమిధలు ఆహుతి చేస్తున్న సమయంలో యాగశాలలో పొగ పెద్ద ఎత్తున ఏర్పడింది. దీంతో అక్కడున్న రుత్వికులు - ఇతరులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడడంతో వారంతా బయటకు పరుగులు తీసినట్లుగా సమాచారం. అయితే... వెంటనే ఎగ్జిట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసి పొగను బయటకు పంపే ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి యాగం నిరాటంకంగా సాగింది.

రెండు రోజులుగా వాతావరణం మారడం... చలిపెరగడంతో గాలిలో ఆర్ద్రత పెరిగింది. పైగా మంచు కూడా ఆవరించి ఉండడంతో పొగ పైకి వెళ్లే పరిస్థితి లేదు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో యాగశాలలో ఏర్పడిన పొగ అక్కడే గాలిలో నిండిపోయి తేమతో కలిసి బరువుగా మారి పైకి వెళ్ల కుండా భూమికి కొద్ది ఎత్తులోనే ఉండిపోయింది. దీంతో పొగ పైకి వెళ్లకుండా అక్కడే ఉండిపోవడంతో ఆక్సిజన్ శాతం తగ్గి గాలి పీల్చుకోవడం కష్టమైంది. అయితే... వెంటనే నిర్వాహకులు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెద్ద సంఖ్యలో అమర్చడంతో ఇబ్బంది తొలగింది. సుమారు అరగంట పాటు యాగానికి ఆటంకం కలిగినా ఆ తరువాత మళ్లీ ఎప్పటిలా కొనసాగింది.