Begin typing your search above and press return to search.
అమ్మ బుగ్గన నాలుగు రంధ్రాలేమిటి?
By: Tupaki Desk | 8 Dec 2016 1:02 PM GMTలేత గులాబీ రంగులో కనిపించే అమ్మ ముఖాన్ని చూడటం అలవాటైన వారికి.. అమ్మ భౌతికకాయాన్ని చూసినప్పుడు నోట మాట రాలేదు. పెద్దాలు రెండు విడదీసి ఉండటం.. ఆసుపత్రిలో 74 రోజుల పాటు చేసిన పోరాటం తాలూకు అలసట స్పష్టంగా కనిపించాయి. వీటితో పాటు.. అమ్మ బుగ్గల మీద నాలుగు గాట్లు (చిన్నపాటి రంధ్రాలు) పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మిగిలిన భాగమంతా పెద్ద మార్పులేమీ లేకున్నా.. నాలుగు రంధ్రాలు ఎందుకు ఉన్నాయి? అమ్మకేమైంది? లాంటి సందేహాలు వ్యక్తమయ్యాయి.
అమ్మ బుగ్గ మీద ఉన్న ఈ రంధ్రాల ఏమిటన్న విషయాన్ని వైద్యుల్ని ప్రశ్నిస్తే.. వారు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్నిరోజుల పాటు చెడిపోకుండా.. కుళ్లిపోకుండా ఉండటం కోసం ఎమాల్మింగ్ చేస్తుంటారు.దేశంలోనికొన్ని రకాలరసాయనాలు.. మందులతో శుద్ధి చేయటంతోపాటు.. దేహం పాడు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇందులో భాగంగా దేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి.. ఆ స్థానంలో రసాయనాన్ని దేహం లోపలకు పంపుతారు. సాధారణంగా ఇలాంటి ప్రక్రియను మెడ వెనుక భాగంలో లేదంటే.. గజ్జల్లో చేస్తుంటారని చెబుతున్నారు. కొందరి వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఆ నాలుగు రంధ్రాలు ఎమాల్మింగ్ రంధ్రాలుగా కొందరు అభివర్ణిస్తుంటే.. మరికొందరుమాత్రం అలాంటిదేమీ ఉండదని.. ఇతర చికిత్సల సందర్భంగా ఏమైనా అలా జరిగి ఉంటుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏమైనా అమ్మ బుగ్గన ఉన్న నాలుగు రంద్రాల మిస్టరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది.