Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్న చిన్న ద్వీపం ఇదే

By:  Tupaki Desk   |   26 March 2020 5:00 PM IST
ప్రపంచంలోనే సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్న చిన్న ద్వీపం ఇదే
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి స్వచ్ఛందంగా సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ తో అంతా బంద్ అయిపోయింది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై నగరం సమీపంలో ఉన్న చిన్న ద్వీపమైన పంజూ గ్రామం తనకు తానే సెల్ఫ్ ఐసోలేషన్ వేసుకొని ఆదర్శంగా నిలిచింది.

థానే జిల్లాలోని వాసాయి తహసీల్ పరిధిలోని పంజూ గ్రామం సముద్రం పక్కన ఉన్న చిన్న ద్వీపం.. 1400 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వారంతా కూలి - వ్యవసాయ పనులు మానేసి సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

పంజా గ్రామస్థులు అంతా ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేసుకున్నారు. గ్రామంలోకి పర్యాటకులు రాకుండా నిషేధం విధించారు.

మహారాష్ట్రలో తీవ్రంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలోనే ముందుజాగ్రత్త చర్యగా మంచి పర్యాటక ప్రాంతమైన పంజూ ద్వీప గ్రామం పూర్తి ఐసోలేషన్ లోకి వెళ్లి కరోనాను అరికడుతున్నారు.