Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుకు పెద్దగా దెబ్బేస్తున్న 'చిన్న' ఇష్యూస్
By: Tupaki Desk | 24 April 2022 2:30 AM GMTపెద్ద గాలివానల్ని చూసిన పే..ద్ద చెట్టు చిన్న చిరుగాలికి కూలిపోతే? పెద్ద దెబ్బల్ని ఎదుర్కొనే సత్తా ఉన్నోడ్ని చిన్న దెబ్బకు విలవిలలాడిపోతే.. కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్న చందంగా పెద్ద పెద్ద ఆరోపణలు.. విమర్శలు పిచ్చ లైట్ తీసుకున్న జగన్ సర్కారుకు గడిచిన కొద్ది రోజులుగా ఎదురవుతున్న చిన్న చిన్న ఇష్యూస్ తెగ ఇబ్బంది పెట్టేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తోపు చంద్రబాబు లాంటోళ్లు ఎంత చించుకున్నా పట్టించుకోని ప్రజలు.. ఒక సాదాసీదా కుటుంబం.. అద్దెకు తీసుకున్న కారులో తిరుమలకు వెళుతూ ఒంగోలు దగ్గర టిఫిన్ సెంటర్ కు వెళ్లినంతనే.. వారి కారును జప్తు చేసి.. సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లిన వైనం చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఈ ఇష్యూ ఎందుకంత సీరియస్ అయ్యింది? ప్రజలంతా ఎందుకంతగా కనెక్టు అయ్యారు? జగన్ సర్కారు తీరుపై నిరసన ఎందుకు వ్యక్తమైంది? సోషల్ మీడియాలో ఎందుకంతలా విరుచుకుపడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత? అనే జగన్ సోషల్ మీడియా సైన్యం సైతం ఎందుకు షాక్ తిన్నట్లు కామ్ గా ఉండిపోయింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. ఇష్యూ చిన్నదే కావొచ్చు. కానీ.. సాదాసీదా ప్రజలను నేరుగా ప్రభుత్వ అధికారుల దాష్ఠీకం రగిలిపోయేలా చేసిందని చెప్పాలి.
ఇది ఒక కొలిక్కి రాక ముందే.. టీటీడీలో చోటు చేసుకున్న మరో అంశం శ్రీవారి భక్తులకు షాకింగ్ గా మారింది. తిరుమల కొండ మీద శ్రీవారి పాటల్ని ఎల్ ఈడీ తెర మీద ప్రసారం చేయటం తెలిసిందే. అలాంటిది ఉన్నట్లుండి ఎల్ ఈడీ తెర మీద సినిమా పాటలు ప్రసారం కావటంతో భక్త జనం ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. తిరుమల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఎల్ ఈడీ తెర మీద చోటు చేసుకున్న ఈ ఉదంతం తిరుమలలో హాట్ టాపిక్ గా కావటమే కాదు.. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనం ముక్కున వేలేసుకునే పరిస్థితి.
ఇలాంటి పరిస్థితి తాము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదన్న మాటతో ముగిసిపోలేదు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమల కొండ మీద ఏదో ఒక అపచారం చోటు చేసుకుంటుందన్న మాట వినిపించటం చూసినప్పుడు.. జగన్ సర్కారుకు జరుగుతున్న డ్యామేజ్ ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు.
నిజానికి.. ఇప్పుడు చెప్పిన ఉదంతంలో కానీ.. మొన్న తిరుమలలో జరిగిన తొక్కిసలాటలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఎలాంటి సంబంధం లేదు. ఆ మాటకు వస్తే పాలనాపరంగా ఆయన తప్పు కూడా లేదనే చెప్పాలి. మరి.. ఇంత డ్యామేజ్ ఎందుకు? అంటే.. ఆయన ఎవరినైతే నమ్ముతున్నారో.. ఎవరినైతే కీలక పదవులు ఇస్తున్నారో.. వారు చేస్తున్న చేష్టలు.. వారి పైత్యం ప్రభుత్వానికి పెద్ద శాపంగా మారిందంటున్నారు.
దీంతో పెద్ద పెద్ద ఆరోపణల వేళలోనూ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి లేదని.. చిన్న చిన్న ఇష్యూస్ కు మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావటంపై పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొన్నటివరకు ఉన్న పరిస్థితికి.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు తేడా ఉందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. లెక్కల్లో తేడా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్ ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.