Begin typing your search above and press return to search.
ఆ 2 రాష్ట్రాల్లో బుల్లి పార్టీ సంచలనం.
By: Tupaki Desk | 14 Dec 2021 4:35 AM GMTకొత్త సంవత్సరంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిసిందే. ఈ ఎన్నికల్లో యూపీ ఫలితం దేశ రాజకీయ పరిణామాల్ని భారీగా ప్రభావితం చేయనుంది. అదే సమయంలో.. చిన్న రాష్ట్రాలైన పంజాబ్.. గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం కొంతమేర ప్రభావితం చేయనున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి.. ఈ రెండు రాష్ట్రాల్లో వెలువడే ఫలితం.. సరికొత్త రాజకీయాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
అదే జరిగితే.. ఇంతవరకు ఢిల్లీ లాంటి ఒక చిన్న రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ.. పాజిటివ్ ఫలితాన్ని సొంతం చేసుకోనుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ.. తాజాగా కొన్ని అంచనాల్ని విడుదల చేసింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాల్ని పక్కాగా అంచనా వేసే సత్తా ఉందనే ఇమేజ్ ఉన్న ‘ఏబీపీ’ (ఆనంద బజార్ పత్రిక) మీడియా సంస్థ తాజాగా కొన్ని అంచనాల్ని విడుదల చేసింది. ఇప్పటికే అధికారంలో ఉన్న పంజాబ్ లో రానున్న ఎన్నికలు భారీ షాకివ్వటం ఖాయమంటున్నారు. మరోసారి పవర్ ఖాయమని నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ ఆశల మీద నీళ్లు చల్లుతూ.. అంత సీన్ లేదని తేల్చేసింది. ఇంతకాలం పంజాబ్ లో అయితే కాంగ్రెస్ లేదంటే అకాలీదళ్.. బీజేపీల మధ్యనే పోరు ఉండేది.
తాజా అంచనాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ పార్టీ భారీగా బలపడటమే కాదు.. అందుకు తగ్గట్లే ఫలితాలు రానున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకంగా 50 నుంచి 56 స్థానాల్ని సొంతం చేసుకొని.. ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.అదే సమయంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు 39 - 45 మధ్య సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అకాలీదళ్ కు 17 నుంచి 33 సీట్లు.. బీజేపీ మాత్రం దారుణంగా సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమవుతుందన్న అంచనాల్ని వెల్లడించింది.
ముఖ్యమంత్రి రేసులో.. చరణ్ జిత్ సింగ్ కు ఎక్కువ మంది పంజాబీలు ఓటు వేశారు. ఆయన్ను సీఎం చేసేందుకు 32.9 శాతం మంది ఓకే చెబితే.. అరవింద్ కేజ్రీవాల్ కు 23.7 వాతం.. అకాలీదళ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు 17.5 శాతం.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన భగవాన్ మాన్ కు 12.8 శాతం మంది మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అంత ప్రభావం చూపరని తాజా అంచనా వెల్లడించింది. పంజాబ్ ఫలితం ఈ రీతిలో ఉంటే.. గోవా రాష్ట్ర ఫలితం ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే.. ఈసారి అధికార బీజేపీకి మరోసారి పవర్ రావటం ఖాయమని తేల్చారు.
కమలం పార్టీకి చెందిన ప్రమోద్ సావంత్ నేతృత్వంలో 17-21 సీట్లు గెలుచుకునే వీలుందని అంచనా వేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు మాత్రమే సొంతం చేసుకోగా.. ఈసారి బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో 17 స్థానాల్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి కేవలం 4-8 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని తేల్చారు. ఇక.. ఆమ్ ఆద్మీ పార్టీ 5-9 సీట్లను సొంతం చేసుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందన్న అంచనాలు వెలువరించింది.
అంటే.. పంజాబ్ లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా.. గోవాలో.. ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్.. లేదంటే బీజేపీ అన్న దానికి బదులుగా ఆమ్ ఆద్మీ అనే కొత్త ఫోర్సు తెర మీదకు రానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ అంచనా ఏ మేరకు నిజమన్నది తేలాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేస్తే సరిపోతుంది.