Begin typing your search above and press return to search.

స్మార్ట్ టీవీ ఎంత పనిచేసింది.. శృంగారం ఆన్ లైన్లో..

By:  Tupaki Desk   |   10 July 2019 4:48 AM GMT
స్మార్ట్ టీవీ ఎంత పనిచేసింది.. శృంగారం ఆన్ లైన్లో..
X
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన ఓ కొత్తగా పెళ్లైన జంట.. పడకగదిలో స్మార్ట్ టీవీ. దానికి వైఫై కనెక్షన్. ఇంటర్నెట్ లో పోర్న్ వీడియోలు చూస్తూ అనుసరిస్తూ రెచ్చిపోయారు. అదే పోర్న్ సైట్ లలో వీడియోలు సెర్చ్ చేస్తుండగా షాక్. వీరి పడకగది శృంగార వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షం. షాక్ అవ్వడం వీరివంతైంది. ఎలా జరిగిందని రూము అంతా కెమెరాలున్నాయా అని చూశారు. ఎక్కడా లేవు. మరి ఎలా జరిగింది.

సదురు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు అని సైబర్ నిపుణుడిని సంప్రదించాడట.. అతడు వీరి పడకగది అంతా వెతికి కెమెరాలు ఏవీ లేవని తేల్చాడు. మరీ వీడియో ఎలా చిత్రీకరణ జరిగిందని చూస్తే స్మార్ట్ టీవీ వల్ల అని తేలింది.

అవును.. అత్యాధునిక ఈ స్మార్ట్ టీవీకి ఒక ఇన్ బెల్ట్ కెమెరా ఉంది. దానికి వైఫై కనెక్షన్ ఉంది. ఒక హ్యాకర్ ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ టీవీని హ్యాక్ చేశాడు. ఆ కెమెరాతో వీరి పడకగది వీడియోను తీసి పోర్న్ సైట్ కు అమ్ముకున్నాడట.. ఇలా ఎన్ని సార్లు జరిగిందో తెలియదు. ఆన్ లైన్లో తమ వీడియోను తీయించడానికి ఇప్పుడా జంటా నానా తిప్పలు పడుతోంది. సైబర్ నిపుణులతో సంప్రదిస్తోంది. పోలీసులకు చెబితే పరువు పోతుందని గుట్టుచప్పుడు కాకుండా ఇలా చేస్తున్నారు.

ఇదీ అత్యధిక ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ టీవీల వల్ల అనర్థం. వీడియో కాలింగ్ సదుపాయం కూడా ఉండడంతో స్మార్ట్ టీవీలకు ముందు కెమెరా వస్తోంది. వైఫై కనెక్షన్ ద్వారా ఆ స్మార్ట్ టీవీని హ్యాకర్ నియంత్రించాడు. వీరి పడకగదిని పబ్లిక్ చేశాడు. టెక్నాలజీని మంచిగా వినియోగిస్తే అంతా మంచిదే. కానీ ఇలా అక్రమంగా వాడితే మాత్రం అందరి బతుకులు రోడ్డున పడుతాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ