Begin typing your search above and press return to search.

స్మిత్​ రేటు రూ. 2 కోట్లా? పాంటింగ్​ ఆశ్చర్యం

By:  Tupaki Desk   |   8 April 2021 1:30 AM GMT
స్మిత్​ రేటు రూ. 2 కోట్లా? పాంటింగ్​ ఆశ్చర్యం
X
స్మిత్​ ​పై ఢిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ పాంటింగ్​ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సారి స్మిత్​ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చూపిస్తాడని.. కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఏడాది రాజస్థాన్​ రాయల్స్​ రూ. 12.5 కోట్లు వెచ్చించి స్మిత్​ ను కొనుగోలు చేసింది. కానీ అతడు పెద్దగా సత్తా చూపలేకపోయాడు. పాయింట్ల పట్టికలో రాజస్థాన్​ రాయల్స్​ చివరి స్థానంలో నిలిచింది. దీంతో అతడిని ఆ జట్టు వదులుకున్నది. ప్రస్తుతం స్మిత్​ ను ఢిల్లీ క్యాపిటల్స్​ దక్కించుకున్నది. స్మిత్​ కోసం బెంగళూరు రాయల్​ చాలెంజర్స్​, ఢిల్లీ క్యాపిటల్స్​ పోటీ పడగా.. చివరకు ఢిల్లీ రూ. 2.2 కోట్లకు దక్కించుకున్నది.

ఈ విషయంపై ఢిల్లీ హెడ్​ కోచ్​ రికీ పాంటింగ్​ మాట్లాడుతూ.. ’ స్మిత్​ దొరకడం ఢిల్లీ క్యాపిటల్స్​ అదృష్టం అతడు చాలా తక్కువ ధరకే దొరికాడు. గత సీజన్​లో స్మిత్​ పెద్దగా రాణించలేదు. కానీ ఈ ఏడాది పూర్తిస్థాయి ఆటతీరును కనబరుస్తాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే స్మిత్​ ప్రస్తుతం కసిగా ఉన్నాడు. దానికి తోడు వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుంది. దీంతో ఈ సారి అతడు అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంటాడు’ అంటూ పాంటింగ్​ చెప్పుకొచ్చాడు. అయితే స్మిత్ తక్కువ ధరకు దక్కడంపై పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి స్మిత్​ గత సీజన్​లో పెద్దగా రాణించలేదు. ​

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు రూ. 12.4 కోట్లు వెచ్చింది అతడిని కొనుగోలు చేసింది. జట్టుకు కెప్టెన్​ గా కూడా నియమించింది. కానీ రాజస్థాన్​ రాయల్స్​ మొత్తం 14 మ్యాచ్‌ లు ఆడగా కేవలం 6 సార్లే విజయం సాధించింది. 8 సార్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో యాజమాన్యం అతడిని వదులుకున్నది. ఇక చెన్నైలో మినీ వేలం జరగగా ఢిల్లీ క్యాపిటల్స్‌ స్మిత్‌ ను రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. ఏప్రిల్‌ 10న డీసీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో తలపడనుంది. శ్రేయస్​ అయ్యర్​ గాయంతో మ్యాచ్​కు దూరమయ్యాడు. రిషబ్​ పంత్​ కెప్టెన్​ గా వ్యవహరించనున్నాడు.