Begin typing your search above and press return to search.

మీరు సిగ‌రెట్ తాగుతారా.. అయితే మీకు క‌రోనా వ‌చ్చే అవ‌కాశం

By:  Tupaki Desk   |   13 April 2020 3:30 PM GMT
మీరు సిగ‌రెట్ తాగుతారా.. అయితే మీకు క‌రోనా వ‌చ్చే అవ‌కాశం
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న వారికి వివిధ విధానాల్లో ఆ వైర‌స్ సోకుతోంది. ఆ వైర‌స్ ఎటు నుంచి ఎవ‌రికి ఎలా పాకుతుందో కూడా తెలియ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ప‌రిశోధ‌కులు క‌రోనా వైర‌స్ ప‌లు కార‌ణాల‌తో వైర‌స్ సోకుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా క‌రోనాపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న క్ర‌మంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా పొగ‌తాగే వారికి క‌రోనా వైర‌స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గుర్తించారు. కరోనా వైర‌స్ సోకిన వారిలో అధిక మంది పొగతాగే వారేనని తేలింది. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని కరోనా రిస్క్ ఎక్కువని స్ప‌ష్టం చేస్తోంది. ఎందుకంటే పొగ‌తాగితే ఊపిరితిత్తుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ కూడా అంతే. మొద‌ట ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం చూపుతుంది. అందుకే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఏర్ప‌డుతుంది. ఈ విష‌యాన్ని గుర్తించాలి.

పొగతాగే వారిపై కరోనా వైరస్‌ అధికంగా ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఎందుకంటే పొగ పీల్చినప్పుడు ఎస్-2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, కరోనా వైరస్‌ నేరుగా, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని డ‌బ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగ తాగేవారేనని త‌మ ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని తెలిపింది. తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారిపై కూడా కరోనా వైరస్‌ అంతే తీవ్రంగా దాడి చేస్తుందని వివ‌రించింది. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ అధ్యయనం చేశారు. ఆయ‌న అధ్య‌య‌నంలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.

పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో కరోనా వైర‌స్ బారిన పడిన 82,052 మందిలో 95% మంది పొగ తాగే అలవాటు ఉన్న‌వారే ఉన్నారు. ఇటలీలోనూ పొగతాగే అలవాటు ఉన్నవారికే అధికంగా క‌రోనా సోకింది.