Begin typing your search above and press return to search.
వివాదంలో ప్రియాంక..మాజీ ప్రధానిని అవమానించారా?
By: Tupaki Desk | 21 March 2019 5:57 AM GMTరాజకీయాలు అంత ఆషామాషీగా ఉండవు. అందునా.. ప్రధాని మోడీ మీద లడాయి అంటే మాటలు కాదు. ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన మరుక్షణం నుంచి ఎటువైపు నుంచి ఎలాంటి చిక్కులు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితి. మోడీ లాంటి నేతను ఢీ కొనటం అంత సులువైన విషయం కాదన్న విషయం ప్రియాంక గాంధీకి తాజాగా తెలిసి వచ్చి ఉంటుంది.
చూసేందుకుచిన్నవిగా అనిపించే విషయాలే తన ఇమేజ్ మొత్తాన్ని నాశనం చేస్తాయన్న విషయాన్ని ప్రియాంక ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. కావాలని చేశారని చెప్పలేం కానీ హడావుడితో ఆమె చేసిన పని ఇప్పుడు వేలెత్తి చూపించేలా ఉండటమే కాదు.. అరే.. ఇలా చేస్తారా? అన్న సందేహాన్ని కలిగేలా చేయటం ఖాయం.
ఇలాంటి అంశాల కోసం చూసే మోడీ బ్యాచ్ కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే రాహుల్ కు పంచ్ వేసేందుకు తమ పేర్ల ముందు చౌకీదార్ అన్న పదాన్ని పెట్టుకున్న మోడీ పరివారం.. తాజాగా ప్రియాంక గాంధీ చేసిన తప్పును భారీ ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అవమానించారంటూ కొత్త ఆరోపణను తెర మీదకు తెచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
తాజాగా ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో తనకు వేసిన పూలమాలను ప్రియాంక లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక వ్యంగ్య కవితను సైతం పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ చోటు చేసుకున్నదంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రామ్ నగర్ లోని శాస్త్రి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె మెడలో పూల మాలలు వేశారు. తనకువేసిన ఒక పూలదండను చేత్తో పట్టుకున్న ఆమె.. లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసేశారు. దీంతో.. ప్రియాంక మాజీ ప్రధానిని అవమానించారన్న ప్రచారాన్ని బీజేపీ నేతలు షురూచేశారు. ప్రియాంక వెళ్లిన కాసేపటికి అక్కడికి చేరుకున్న కమలనాథులు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు. చూస్తూ చూస్తూ ఎవరు మాత్రం వివాదాల్లో చిక్కుకోవాలని అనుకోరు కదా. కానీ.. హడావుడిలో జరిగిన చిన్న పొరపాటునుఅసరాగా చేసుకొని కమలనాథులు చెలరేగిపోతున్నారని చెప్పక తప్పదు.