Begin typing your search above and press return to search.

సొంతంగా మాట్లాడగలవా సోనియమ్మా..!!

By:  Tupaki Desk   |   7 Aug 2015 12:39 PM GMT
సొంతంగా మాట్లాడగలవా సోనియమ్మా..!!
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యాపం, 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లలిత్ గేట్ అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్న సంగతి తెలిసిందే... లలిత్ గేట్ పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత దానిపై సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మృతి ఇరాని తనదైన శైలిలో సోనియాపైన విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు. సోనియాకు మాట్లాడడం రాదని... దేనిపైనా ఆమె మాట్లాడలేరని.. ప్రసంగ పాఠాన్ని పేపర్ పైన రాసుకొని మొత్తం చదువుకున్నాకే మాట్లాడగలరని ఎద్దేవా చేశారు. సుష్మా మాటల గారడి చేస్తున్నారన్న వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుబట్టారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ పైన నాలుగు రోజులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపైనే కాక ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు కూడా ప్రతి విమర్శలు మొదలుపెట్టాయి. దీంతో మాటల దాడులు అధికమవుతున్నాయి. ఆ క్రమంలోనే స్మృతి సోనియాపై ఈ వ్యాఖ్యలు చేశారు