Begin typing your search above and press return to search.
హిందుత్వ వ్యతిరేకి.. పూజలెలా చేస్తున్నావ్..!!
By: Tupaki Desk | 7 Oct 2018 7:48 AM GMTమధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలోని నర్మదా నదికి పూజలు చేయడంపై కేంద్రమంత్రి సృతీ ఈరానీ అదిరిపోయే సెటైర్ వేశారు. ఎన్నో ఏళ్లుగా గుర్తుకు రాని దేవాలయాలు - దైవభక్తి ఎన్నికల వేళనే రాహుల్ గాంధీకి గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే రాహుల్ గాంధీ గుడిమెట్లు ఎక్కుతున్నారని స్మృతి చురకలంటించారు.
అతివాద హిందుత్వంపై తరచూ విమర్శలు చేస్తూ.. హిందువులతోనే ఘర్షణలు జరుగుతున్నాయన్న రాహుల్.. ఇప్పుడు ఎలా దేవాలయాలు సందర్శిస్తున్నాడని స్మృతి ప్రశ్నించారు. హారతులు - రామనామ జపం చేస్తూనే మళ్లీ హిందూమతంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన రామనామ జపమే బీజేపీ సాధించిన విజయంగా అభివర్ణించారు. అతివాద హిందుత్వపై కోర్టుకు వెళ్తానన్న రాహుల్ .. దమ్ముంటే.. ఇప్పుడు రాముడు లేడని కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్మృతి సూచించారు.
ఇటీవల యూపీలో తన సొంత నియోజకవర్గం అమేథిలో పర్యటించిన రాహుల్ అక్కడ హిందుత్వ ఉగ్రవాదంపై ఘాటు విమర్శలు చేశారు. హిందూ ఉగ్రవాదం.. టెర్రరిజం లష్కరే తోయిబా కంటే ప్రమాదకరమని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇప్పుడు దేవాలయాలు సందర్శిస్తూ.. హారతులు ఇవ్వడంపై స్మృతి సెటైర్ వేశారు.